ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల జమానా..ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ వాడకం దారులు ఎక్కువ అయ్యారు.  అయితే ఫోన్ కమ్యూనికేషన్ కోసం ఫోన్ వాడితే తప్పులేదు..కానీ ఈ మద్య స్మార్ట్ ఫోన్లతో సెల్ఫీల మోజు ఎక్కువ అయ్యింది.  ఇక్కడే చాలా మంది దారుణమైన పొరపాట్లు చేస్తున్నారు. సెల్ఫీ పిచ్చిలో పడి తాము ఏం చేస్తున్నామో..ఎక్కడ ఫోటోలు తీయించుకుంటున్నామో తెలియని దుస్థితికి చేరుకుంది. అలా సెల్ఫీ మోజులో పడి చాలా మంది ప్రాణాలమీదకు తెచ్చుకోవడం..కొన్ని సార్లు ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. 

ఇక విహార యాత్రలకు వెళ్లి సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి.  తాజాగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సెలవు రోజున సరదాగా గడపాలనుకున్న స్నేహితులు అన్యాయంగా ప్రాణాల మీదకు తెచ్చుకొని చనిపోయిన సంఘటన  శివపురి-గ్వాలియర్ సరిహద్దుల్లో జరిగింది.  వివరాల్లోకి వెళితే.. స్వాతంత్ర దినోత్సవం సెలవు రోజున ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో 45 మంది సభ్యులతో ఉన్న బృందం ఒకటి మధ్యప్రదేశ్ లోని శివపురి-గ్వాలియర్ సరిహద్దుల్లోని సుల్తాన్  ఘడ్ వద్ద వాటర్ ఫాల్స్ సమీపానికి పిక్నిక్ కు వచ్చింది. అందులో కొంత మంది టర్ఫాల్స్ వద్దనున్న కొండ అంచుకు దగ్గరగా వెళ్లారు. 
Image result for Shivpuri-Flash-Flood
అక్కడ హ్యాపీగా ఫోటోలు తీసుకోవడం మొదలు పెట్టారు.  టి ప్రవాహం తక్కువగా ఉండటంతో సరదాగా సాగుతున్న వారి పిక్నిక్ లో వరుద రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. అప్పటివరకూ నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉన్న క్రమం నుంచి క్షణాల్లో భారీగా పెరిగిన నీటి ప్రవాహాన్ని గుర్తించి.. తేరుకునే లోపే.. భారీగా వరద ఆ బృందాన్ని చుట్టుముట్టింది.   అప్పటికే కొంత మంది జాగ్రత్త పడి ఒడ్డుకు చేరుకున్నారు..కానీ 11 మంది మాత్రం ఒడ్డుకు చేరుకునే లోపు నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు.
Image result for Shivpuri-Flash-Flood
మిగిలిన వారు రాక్ పైభాగాన చిక్కుకుపోయారు. ప్రవాహ ఉధృతి నుంచి తమను తాము కాపాడుకుంటూ 9 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ సర్కార్ హుటాహుటిన రెస్య్కూసిబ్బందిని రంగంలోకి దింపింది. హెలికాఫ్టర్ సాయంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాగలిగారు.  కానీ వరుదలో కొట్టుకు పోయిన వారి ఆచూకి ఇంత వరకు లభించలేదు..గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: