భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి రాజకీయాల్లో ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా రాజకీయాలను క్లీన్ రాజకీయాలుగా మార్చినాడు ఎటువంటి రాగ ద్వేషాలు లేని నేత చివరి వరకు నీతి నిజాయితీకి రాజ్యాంగానికి కట్టుబడిన అరుదైన నాయకుడు. అతని రాజకీయ జీవితం ను ఒక సారి పరిశీలిద్దాం.1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టు కాబడిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది.

Image result for atal bihari vajpayee

ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు నెరపనని వ్రాతపూర్వకమైన హామీ యిచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టారు. 1951 లో క్రొత్తగా యేర్పడిన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణపక్ష రాజకీయపార్టీలో పనిచేయడానికి, ఆర్.ఎస్.ఎస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని నియమించింది. ఈ సంస్థ ఆర్.ఎస్.ఎస్ తో కలిసి పనిచేస్తున్న హిందూ రాజకీయ పార్టీ.

Image result for atal bihari vajpayee

ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ యొక్క ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క అనుయాయిగా మరియు సహాయకునిగా మారాడు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి భారతదేశ దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికైనారు. ఆయన వాగ్ధాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు


మరింత సమాచారం తెలుసుకోండి: