భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వాజ్‌పేయ్ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు మించినవారు మరొకరు లేరు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన హయాంలో 1999లో పాకిస్తాన్ భారత్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. రెండు దాయాది దేశాల మధ్య జరిగిన ఈ పోరులో భారత్ విజయ జండా ఎగరవేసిన విషయం మనకందరికీ తెలిసినదే. మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని శత్రు దేశమైనా పాకిస్తాన్ మనదేశ జవాన్లను చాలామందిని చంపేయడం జరిగింది.
Image result for vajpayee
భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం చలికాలంలో జరిగింది. ఈ క్రమంలో చలికాలంలో సైన్యం తమ తమ పోస్టులను  వదిలి వెచ్చగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్తాయి. భారత సైన్యం ఎప్పటిలాగానే తమ బంకర్లు ఖాళీ చేసి వేరే చోటికి తరలివెళ్లాయి. వ్యూహాం ప్రకారం పాకిస్తాన్‌ అదను చూసి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. కార్గిల్ ప్రాంతం రక్షణపరంగా భారత్‌కు అత్యంత కీలకమైనది.. దీనిని కైవసం చేసుకుంటే లడఖ్‌ను కైవసం చేసుకుని.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను తమ వశం చేసుకోవాలన్నది పాక్ పన్నాగం.. కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాక్ సేనలకు భారత సైనికులు సులభంగా కనిపిస్తారు.
Related image
ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆధీనం చేసుకుని భారత్ను దెబ్బతీయాలని పాకిస్తాన్ పన్నాగం. వేసుకున్న పన్నాగం ప్రకారం దాయాది దేశమైన పాకిస్థాన్ భారత్లో ఉన్న కార్గిల్ ఆక్రమించింది. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే కార్గిల్ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్ళిందన్న విషయం భారత సైన్యానికి కానీ, భారత ప్రభుత్వానికి కానీ తెలియదు. అయితే మే నెలలో కానీ విషయం మనకు తెలియలేదు.. గస్తికి వెళ్లిన రెండు బృందాలు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో భారత్ సైన్యం భారీగా అక్కడికి చేరుకునే ప్రయత్నంలో ఓ పశువుల కాపరి తన గేదె తప్పిపోయిందని తెర కార్గిల్ ప్రాంతంలో చూస్తే కొంతమంది తన చేతిని చంపుకుని తింటున్నారని భారత్ ఉన్నతాధికారులకు తెలిపాడు ఆ పశువుల కాపరి.
Image result for vajpayee kargil war
అంతేకాకుండా అక్కడ శత్రుదేశం ఎటువంటి బంకర్లుతో ఆయుధాలతో ఉందో కూడా పూసగుచ్చి చెప్పాడు. ఈ క్రమంలో ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయ్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి రాజకీయ నాయకులకు కూడా మతిపోతుంది. ఆ సమయంలో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న కార్గిల్ ప్రాంతాన్ని భారత సైన్యం వ్యూహాత్మకంగా ఆ ప్రాంతానికి బయటనుండి ఏ ఎగుమతులు వెళ్లకుండా నిలిపివేసింది. ఈ క్రమంలో నాటి ప్రధాని వాజ్‌పేయ్ రక్షణ నిపుణలతో చర్చించి పాక్‌కు ధీటైన వ్యూహాన్ని అమలు చేశారు. నేలపై ఉన్న సైన్యానికి, వాయుసేన పూర్తి అండగా నిలివగా.. భోఫోర్స్ ఫిరాంగుల గర్జనకు పాక్ హడలిపోయింది.
Related image
అలా సుమారు రెండు నెలల పాటు భారత సైన్యం మొక్కవోని దీక్షతో శత్రుసైన్యాన్ని మట్టికరిపించి.. కార్గిల్‌లో తిరిగి మువ్వన్నెల జెండా ఎగురవేసింది. ఈ యుద్ధంలో 537 మంది జవాన్లు అమరులవ్వగా.. 1363 మంది క్షతగాత్రులయ్యారు. ప్రపంచ చరిత్రలో కార్గిల్ యుద్ధం ప్రత్యేకమైనది. మొత్తంమీద చూసుకుంటే కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా వైమానిక దాడి తోపాటు అణుదాడికి కూడా నాటి ప్రధాని వాజ్ పేయ్ రెడీ అయ్యారట...కానీ చివరి నిమిషంలో పాకిస్తాన్ మనసు మార్చుకోవడంతో...భారత్కు పూర్తిగా లొంగిపోవడంతో వాజ్‌పేయ్ అణుదాడి నిర్ణయాన్ని మార్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: