పరిపాలనలో అయిన యుద్ధరంగంలో నైనా అటల్ బీహార్ వాజ్‌పేయీ తీసుకునే నిర్ణయాలు చాలా భిన్నంగా...మరియు అదేవిధంగా చాలా కచ్చితంగా ఉంటాయి. అందుకేనేమో ఆయన భారత్ ని  పరిపాలించిన ప్రధానులలో ముఖ్యుడు అని పేర్కొంటారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైనా నిర్ణయం పార్లమెంటులోగానీ దేశ ప్రజలలో నైనా గాని ప్రకటన చేయాలంటే కచ్చితంగా దేశంలో ఉండే సంఘ సంస్థల ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి సంబంధించిన పెద్దలు అధికారులు నిర్ణయాలు తీసుకుని మరి పార్లమెంటులో సదరు నిర్ణయాలను అమలు పరుస్తారు.
Image result for vajpayee
అయితే వాజ్‌పేయీ హయాంలో మాత్రం బిజెపి పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉన్నాగాని ఎక్కడా కూడా మత సంస్థలు ప్రభుత్వ నిర్ణయాలలో చేతులు పెట్టకుండా జోక్యం చేసుకోకుండా తనదైన శైలిలో పరిపాలించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఎక్కువగా వెనకనుండి నడిపించేది ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.
Image result for vajpayee
దేశంలో పెద్ద సంస్థలు బిజెపి పార్టీ వెనక ఉన్న కానీ తన హయాంలో మాత్రం ఎవరి కి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంతే ఇచ్చేవారు వాజ్‌పేయీ. ఇటువంటి భిన్న వ్యక్తిత్వం కలిగిన వాజ్‌పేయీ కి తన జీవితంలో వచ్చిన ఒక ఫోన్ కాల్ ఎప్పటికీ మరువలేనిది.  1999 కార్గిల్ వార్ బీకరంగా జరుగుతుంది. యుద్దం జరుగుతున్న ఒక రోజు రాత్రి అమెరికా వైట్ హౌస్ నుంచి వాజ్ పాయ్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
Image result for vajpayee
భారత్ కనుక యుద్దం ఆపకపోతే పాకిస్తాన్ అణుబాంబు వేయటానికి సిద్దంగా ఉన్నది అని సమాచారం ఇచ్చారు. అందుకు మన వాజ్ పాయ్ గారు క్షణం లేటు చేయకుండా వేంటనే ప్రతిస్పందిస్తూ అణుధాడి జరిగి సగం భారతదేశం పోయినా సరే రేపు పోద్దున కల్లా పాకిస్తాన్ ని ప్రపంచంలో లేకుండా చేస్తాము అని హేచ్చరించారు.తరువాత పాకిస్తాన్ తీవ్ర పరాజయం పాలైన విషయం తేలిసిందే.నాయకుడికి ఖచ్చితత్వం గురి ఉంటే చాలు , అణుబాంబులు ఏంటి అంతకంటే తీవ్రమైన ఆయుధాలు కూడా మనల్ని తాకాలంటే వణికిపోతాయ్...మొత్తంమీద చూసుకుంటే భారతీయ రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో అటల్ బిహారి వాజ్‌పేయీ తనకంటూ కొన్ని పేజీలు ఏర్పర్చుకున్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: