రాజనీతిజ్ఞుడు, కవి, మూడు సార్లు ప్రధానిగా చేసిన అటల్‌ అస్తమించారు. 1924-2018 వరకు తన సుదీర్ఘ ప్రస్తానం కొనసాగించిన వాజ్‌పేయి ఇకలేరు. కొద్ది సేపటి క్రితం ఎయింస్ వైద్యులు ఆయన మరణ వార్తలు ధ్రువీకరించారు. 1924 డిసెంబర్ 25న వాజ్‌పేయి జన్మించారు. ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు. ఎన్నో గౌరవాలు, ఉన్నత పదవులు ఆయనను వరించి వచ్చాయి.
 భారత రత్నగా, దేశ మాత ముద్దు బిడ్డగా  వాజ్‌పేయి చేసిన సేవలు నిరుపమానం.  పదిసార్లు లోక్‌సభ, 2 సార్లు రాజ్యసభకు పనిచేసిన అటల్‌ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 13 రోజులు ప్రధానిగా చేసి రికార్డు నెలకొల్పారు. దేశ రాజకీయాలను కాంగ్రెసేతర మార్గం వైపు విజయవంతంగా నడిపించిన నాయకుడు అటల్ బిహారీ  వాజ్‌పేయి అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: