అటల్ బిహారీ వాజ్ పేయీ.  ఈ పేరు భారత దేశంలో దాదాపుగా ఎనభై ఏళ్ళుగా మారుమోగుతూనే ఉంది. పద్నాలుగేళ్ళ వయసులోనే రాష్ట్రీయ స్వయం సంఘం లో చేరిన అటల్ అక్కడే తీర్చిదిద్దబడ్డాడు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నాడే నిర్ణయించుకున్నాడు. ఆరెసెస్ రాజకీయ రూపం జనసంఘ్ కి వెన్ను దన్నుగా నిలిచిన అటల్ 1957లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యాడు. యువకునిగా వాజ్ పేయ్ తన వాగ్దాటితో నాటి ప్రధాని పండిట్ నెహ్రూని విశేషంగా ఆకట్టుకున్నాడు.


ఆ మాటలు నిజం అయ్యాయి :



 ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని అవుతావంటూ నెహ్రూ పండితుని చేత ప్రశంసలు పొందిన వాజ్ పేయ్ అది నిజం చేసి చూపించాడు. నెహ్రూ తనయ ఇందిర ప్రధానిగా ఉండగా 1971న పాకిస్తాన్ తో వచ్చిన  యుధ్ధంలో ప్రతిపక్ష  నాయకునిగా కాకుండా ఈ దేశ బిడ్డగా ఇందిరకు పూర్తి మద్దతు ఇచ్చి వెన్నంటి నిలిచిన ఘనత అటల్ జీదే. ఆ టైంలో ఇందిరను అపర కాళీ అంటూ వాజ్ పేయ్ పొగిడి రాజకీయాలేకే సరి కొత్త అర్ధం చెప్పాడు. రాజకీయ‌ విభేదాలు పార్టీలకే పరిమితం కావాలి తప్ప వ్యక్తులకు కాదన్న మాటను ఆచరణలో చూపించిన మాననీయుడు వాజ్ పేయి. 


ప్రజా నాయకుడు :



పది సార్లు లోక్ సభ, రెండు సర్లు రాజ్యసభ ద్వారా ఎన్నికై  ఈ దేశానికి విశేష సేవ చేసిన వాజ్ పేయ్ మూడు పర్యాయాలు ప్రధానిగా దేశానికి సేవలు అందించారు. అణు పరీక్షలు నిర్వహించి సాహస ప్రధానిగా నిలిచారు. తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డ్ స్రుష్టించారు. భారత మాత సేవలో నిండు జీవితం పండించుకున్న వాజ్ పేయ్ నిజంగా భారత రత్నమే.



మరింత సమాచారం తెలుసుకోండి: