వాజ్ పేయ్ మీద ఓ సరదా కామెంట్ ఉండేది. ఆయనంటే అందరికీ ఇష్టమే. కానీ బీజేపీ సిధ్ధాంతాలతో పడేది కాదు. దాంతో ఓ మంచి నాయకుడు తమకు ఇష్టం లేని పార్టీలో ఉన్నారంటూ ఆయన రాజకీయ సహచరులు ఆట పట్టించేవారు అలా పుట్టుకు వచ్చిందే రైట్ మాన్, రాంగ్ పార్టీ అన్న మాట. వాజ్ పేయ్ దీనిని లైట్ గా తీసుకుని నవ్వేసేవారు.


ప్రతిపక్ష బెంచీకే :


వాజ్ పేయి సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఎంపీగానే ఉన్నారు. ఆయన వెనక ఎంతో మంది జూనియర్లు  ఇలా  వచ్చి అలా ప్రధానులు అయిపోతుండేవారు. . అలా వాజ్ పేయ్ తన రాజకీయ జీవితం మొత్తంలో నెహ్రూని, ఆయన తనయ ఇందిరని, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీని ప్రధానులుగా  చూసేశారు. అంతేనా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వీపీ సింగ్, వాజ్ పేయ్ ని రాజకీయ  గురువుగా భావించే చంద్రశేఖర్ కూడా ప్రధానులయ్యారు. ఇక కాంగ్రెస్ లో సీనియర్ నేత పీవీ నరసిమ్హారావు హయాన్ని అటల్ జీ చూశారు.


అట్నుంచి ఇటు వస్తే :


ఇలా జీవిత పర్యంతం అధికార రాజకీయాలకు దూరంగా ప్రతిపక్ష బెంచీలకే పరిమితమీనా వాజ్ పేయ్ ఏనాడూ నిరాశ చెందలేదు. మీలాంటి వారి సేవలు ఈ దేశానికి అవసరం, అధికారం వైపు రండి, రాంగ్ పార్టీని వదలి అన్ని ఎన్ని విన్నపాలు వచ్చినా తొణకని బెణకని రాజకీయ ఉక్కు మనిషి అటల్ జీ. తాను పెంచి పోషించిన బీజేపీ ద్వారానే ఆయన ప్రధాని కావాలనుకున్నారు, అయ్యారు.


వెంటాడిన ఆ నంబర్ :


అలా 1996 మే 15న వాజ్ పేయ్ ఈ దేశానికి తొలి కాంగ్రేసేతర, బీజేపి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేవలం 13 రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో కొనసాగారు. అతి పెద్ద పార్టీగా నాడు బేజేపీ గెలిచినప్పటికీ కాంగ్రెస్, ఇతర పార్టీల రాజకీయం యునైటెడ్ ఫ్రంట్ పేరిట చేసిన ప్రయోగం ఫలితంగా వాజ్ పేయి 13 రోజులకే పదవి కోల్పొయారు. ఆ తరువాత  దెవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులు అయ్యారు. మళ్ళీ 1998లో జరిగిన ఎన్నికలలో వాజ్ పేయ్ ప్రధాని  అయ్యరు. ఈ సారి 13 నెలలకే పదవి పోయింది. మూడొసారి 1999లో గెలిచినపుడు మాత్రం  పూర్తి కాలం పనిచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: