పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి విడి పోయి ఆ పార్టీ మీద ఓ రేంజ్ లో బుసలు కొడుతున్నాడు. సంధు  దొరికి నప్పుడు ప్రతి సారి లోకేష్ ను ఒక ఆట ఆడుకుంటున్నాడు. లోకేష్ కు ఏం అర్హత ఉందని ప్రతి సభలో దుమ్మెత్తి పోస్తున్నాడు. అయితే  2019లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ఎందరు నమ్ముతున్నారు? రాష్ట్రంలో అలాంటి వారు పదిశాతం మంది కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అయితే పవన్ కు కొన్ని సీట్లు మాత్రం వస్తాయనే నమ్మకం అందరిలోనూ ఉంది.

Image result for pavan kalyan jansena

అదే క్రమంలో.. ఆయన అధికారంలో ఎవ్వరుండాలనే విషయాన్ని డిసైడ్ చేయగల స్థాయి సీట్లు సంపాదించుకుంటారనే భరోసా కూడా చాలా మందిలో ఉంది. అది జరగవచ్చు కూడా! మరి అలాంటి పరిస్థితి వస్తే.. పవన్ కల్యాణ్ ఎవ్వరికి మద్దతిస్తారు? ఎవ్వరి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరిస్తారు? అన్నది ఇప్పుడు కీలక చర్చ. ఈ ప్రశ్నకు సమాధానం.. స్వాతంత్ర్య దినోత్సవం నాటి పవన్ ప్రసంగంలో స్పష్టంగానే ఉంది.

Image result for pavan kalyan jansena

ఆయన లెక్కలు, విశ్లేషణలు, పవన్ పరిగణించే అర్హతల దృష్ట్యా.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే జైకొడతారనే విధంగా.. మాటలు సంకేతాలిస్తున్నాయి. పవన్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. కేటీఆర్ పోరాడిన, ప్రజల్లోంచి గెలిచిన అనుభవం ఉంది.. మరి లోకేష్ కు సీఎం కావడానికి ఏం అర్హత ఉంది? అని ప్రశ్నించారు. ఇక్కడ కేటీఆర్ ను మాత్రం సీఎం పదవికి పూర్తి అర్హుడిగా పవన్ పరిగణిస్తుండడం విశేషం. లోకేష్ కు అర్హత లేదు అన్నదొక్కటే పవన్ ఆవేదనగా కనిపిస్తోంది. ఆ రకంగా పోరాటపటిమ, ప్రజల్లోంచి గెలిచి రాజకీయాల్లోకి రావడం అనే విషయాల్లో జగన్ కు కూడా తిరుగులేని మార్కులు పడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: