రాహుల్ అధ్యక్షతన ఏర్పాటు అయినా సభకు నారా బ్రాహ్మణి హాజరు కావడం తో రాజకీయాల్లో కొత్త  చర్చలకు తావునిచ్చింది. టీడీపీ మరియు కాంగ్రెస్ కలిసి పోతుందనడానికి ఇది నిదర్శనము అనుకోవాలా..! అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి నారాలోకేశ్ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంటి ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Image result for nara brahmani

అంతేగాకుండా పోలీసు అధికారులు బ్రాహ్మణికి సెల్యూట్ చేస్తుండడం పట్ల విమర్శలు వినిపిస్తున్నారు. దొడ్డిదారిన మంత్రి అయిన నారా లోకేష్‌ను ఎవ్వరూ నాయకునిగా ఎన్నుకోలేదని.. అదీ చాలదన్నట్లు నారా బ్రాహ్మణి కూడా పోలీసుల సెల్యూట్ స్వీకరిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో.. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భార్య, నారా బ్రాహ్మణి సమావేశం కావడంపై కూడా సర్వత్రా విమర్శలొస్తున్నాయి. 

Image result for nara brahmani

 రాహుల్ నిర్వహించిన సమావేశానికి నారా బ్రాహ్మణి హాజరుకావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఈ సమావేశానికి హాజరైనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ దగ్గరవుతోందనే కథనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌కు నారా బ్రాహ్మణి ట్రస్టీగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: