అటల్ జీకి ఆంధ్రులంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన తొలిసారి ఎంపీ అయిన 1957 నుంచి ఏపీకి తరఛుగా  వస్తూనే ఉండేవారు. అలా 1957లో  విశాఖపట్నంలో జరిగిన మెధావుల సమావేశానికి ఆయన హజరయ్యారు. తెలుగు వారి అభివ్రుధ్ధిని నిండుగా కోరుకున్నారాయన. ఇక్కడ సమస్యలు కూడా పార్లమెంట్లో వినిపించేవారు.  


పార్టీకి సీట్లు :


ఇక వాజ్ పేయ్ 1967 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం జనసంఘ్ తరఫున ఏపీలో విస్త్రుత ప్రచారం చేశారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు బలంగా ఉండేవి. అయినా వాజ్ పేయ్ ఇమేజ్ తో ఉత్తరాంధ్రలోని నెల్లూర్, పరకాల సీట్లను జనసంఘ్ గెలుచుకుంది. అలా తొలి సారి ఏపీ నుంచి పార్టీ జెండా ఎగరేయడానికి వాజ్ పేయ్ చేసిన క్రుషి గొప్పది.


సౌత్  ఇండియాలో ఫస్ట్ :


ఇక 1981 లో విశాఖ కార్పోరేషన్ కు తొలిసారిగా జరిగిన ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుని హోదాలో వాజ్ పేయి ప్రచారానికి వచ్చారు. అప్పట్లో ఏపీలో బలమైన కాంగ్రెస్ సర్కార్ వుంది. పోటీగా జనతా పార్టీ, మరిన్ని పార్టీలూ ఉన్నాయి. కానీ  విశాఖ ప్రజలు వాజ్ పేయ్ ఉపన్యాసాలకు బ్రహ్మరధం పట్టి ఆయన మాట మీద విశాఖ కార్పోరేషన్ ను పెద్ద మెజారిటీతో బీజేపీకి అప్పగించారు. అలా దక్షిణాదిన తొలి విజయం బీజేపీకి దక్కడన్ వెనక వాజ్ పేయ్ ఉన్నారు.


ఆ వేవ్ గ్రేట్ :


అదే విధంగా 1998, 1999 ఎన్నికల టైంలో ఏపీ వ్యాప్తంగా వాజ్ పేయ్ వేవ్ చాలా బలంగా వీచింది. కేవలం నాలుగు శాతం ఓటింగ్ ఉన్న బీజేపీ అమాంతం 18 శాతానికి ఎగబాకడమే కాదు. ఏడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇదంతా వాజ్ పేయ్ గొప్పతనమే. అప్పట్లో ఆయన విశాఖ తో సహా ఉమ్మడి ఏపీలో పలు చోట్ల  చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలా వాజ్ పేయ్ ఏపీ బీజేపీకి ఎప్పటికి అపుడు ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. అయితే ఆ ఓటింగ్ ని కాపాడుకోవడంలో మాత్రం ఇక్కడ బీజేపీ విఫలమైందని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: