భారత దేశ ముద్దు బిడ్డ..మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి మరణం యావత్ భారత దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ చొరవను జాతి ఎప్పుడూ మరిచిపోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వాజ్ పేయీ దేశ ధన్యజీవి అని అన్నారు. 

వాజ్ పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఉదయం న్యూఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు, ఆపై మీడియాతో మాట్లాడారు.  1998లో తాను హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తే ఆయన వచ్చారని, వాంబే (వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన) పథకానికి ఏపీ నుంచే అంకురార్పణ జరిగిందని చెప్పారు. 

అప్పట్లో స్పీకర్ కోసం ఆయన తనను సంప్రదించగా తాను బాలయోగిని సూచించానని, మరో మాట మాట్లాడకుండా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేశారని చెప్పారు. ఎలాంటి స్వార్థచింతన లేని కర్మయోగి అటల్ జీ అని కొనియాడారు.   అటువంటి మహానేతను కోల్పోవడం దేశానికి తీరనిలోటని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: