వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉత్త‌రాంధ్ర‌లో పాద‌యాత్ర చేస్తుండ‌గానే  షాక్ త‌గిలింది. త‌గిలిన షాక్  చిన్న‌దా ?  పెద్ద‌దా ? అన్న‌ది కాదు ఇక్క‌డ విష‌యం.  జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉండ‌గానే విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం మున్సిపాలిటీలో వైసిపి కౌన్సిల‌ర్లు, నేత‌లు టిడిపిలోకి మారిపోయారు. టిడిపి ఎంఎల్సీ ద్వార‌పూడి జ‌గ‌దీష్ ఆధ్వ‌ర్యంలో వైపిపి నేత‌లు కొంద‌రు సైకిల్ ఎక్కారు. 


టిడిపిలో చేరిన నేత‌లు  


వైపు ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న నేప‌ధ్యంలో  పార్టీని ప‌టిష్టం చేయ‌టానికి స్ధానిక నేత‌లు గ‌ట్టిగా ప‌నిచేస్తారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో చాలా చోట్ల టిడిపిలో నుండి వైసిపిలోకి వ‌ల‌స‌లు సాగుతున్నాయి. అటువంటిది విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురంలో మాత్రం వైసిపిలో నుండి ఇద్ద‌రు కౌన్సిల‌ర్ల‌తో పాటు ప‌లువురు ద్వితీయ శ్రేణి నేత‌లు  టిడిపిలోకి ఎందుకు వెళ్ళార‌న్న‌ది వైసిపి నేత‌లు ఆలోచించుకోవాలి. 


ఈ నేత‌లే కీల‌కం


ఏ పార్టీకైనా ద్వితీయ శ్రేణి నేత‌లే ముఖ్యం. ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలింగ్ రోజున ద్వితీయ‌శ్రేణి నేత‌ల పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది.  ఎందుకంటే, బూత్ లెవ‌ల్ కార్య‌క‌ర్త‌ల‌ను, బూతుల వారీగా ఓట‌ర్ల‌లో చాలామందిని  నేరుగా వ్య‌క్తిగ‌తంగా ప‌ల‌క‌రించేంత చ‌నువు వీళ్ళ‌కే ఉంటుంది.  ఒక‌వైపు పలువురు టిడిపి నేత‌లు వైసిపిలో చేరుతున్న స‌మ‌యంలోనే  ఈ మున్సిపాలిటీలో వాళ్ళే వైసిపిని వ‌దిలేశారంటే ఆలోచించాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: