ఏపీలో రగులుతున్న కీలకమైన అంశాలలో కాపుల రిజర్వేషన్ ఒకటి. ఇది సామాజికపరంగా కూడా పెద్ద చిచ్చు రాజేస్తోంది. ఓ వైపు బీసీలు దీనిపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు మాట ఇచ్చి తెలుగుదేశం మోసం చేస్తోందని కాపులు గుస్సా అవుతున్నారు. మరో ఎనిమిది నెలలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కాపుల అంశం చాలా ప్రభావం చూపనుంది. అన్ని రాజకీయ పార్టీల మీద కాపులు వత్తిడి తెస్తున్నారు.


ఎలా చేరుస్తారు :


కాపులు, బలిజ, తెలగ, ఒంటరి ఈ నాలుగు జాతులను బీసీ ఎఫ్ కేటగిరీలో చేరుస్తూ చంద్రబాబు సర్కార్ అంద్రప్రదేశ్ కాపు బిల్-2017ని గత ఏడాది డిసెంబర్  2న ఏపీ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటికి కేంద్రం నుంచి కదలిక వచ్చింది. కాపులను బీసీలలో ఎలా చేరుస్తారని కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అలాగే రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని సుప్రీం కోర్ట్ తీర్పును గుర్తు  చేసింది. 


అక్కడికే సిఫార్స్ :


దీనికి వివరణ ఇచ్చిన ఏపీ అధికారులు జస్టిస్ మంజునాధ కమిషన్ నివేదిక ఆధారంగానే కాపులను బీసీలలో చేరుస్తూ నిర్ణయించామని అన్నారు. వారి ఆర్ధిక స్థితిగతులపై సర్వే చేయించామని చెప్పారు. దీనిని ఓబీసీ కమిషన్ కు సిఫార్ చేస్తామని కేంద్రం పేర్కొన్నట్లు భోగట్టా. ప్రత్యేక కేసుగా చూడాలన్న ఏపీ గవర్నమెంట్ సూచనపై  పెద్దగా  స్పందించని కేంద్రం ఓబీసీ కమిషన్  ముందే ఉంచాలనుకుంటోంది. అదే కనుక జరిగితే బీసీ కేటగిరీలో చేర్చేందుకు కమిషన్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: