ప్రస్తుత రోజుల్లో రాజకీయాలకు అర్ధమే మారిపోయింది. ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల మీద ఒక పార్టీని మరో పార్టీ విమర్శించడం ఇవన్నీ సర్వ సాధారణంగా రాజకీయాల్లో కనిపిస్తూ ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయాలకు అర్ధమే మారిపోయింది. ఎవరు ఎక్కువ తమ నోటికి పని చెప్పి ఎదుటి పార్టీని, తాము టార్గెట్ చేసుకున్న నాయకులను తమ తిట్లతో భయపెడితే వారే హీరో అన్నట్టు తయారయింది పరిస్థితి. విలువలు , నీతి నియమాలు అనేవి బూతద్దం పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం రాజకీయ పార్టీలే. ఎందుకంటే అటువంటి నోటు దురుసు ఉన్న నాయకులను ఏమాత్రం అదుపుచేయడం మానేసి మరింత ప్రోత్సహించే దిశగా అవి ఉండడంతో ఈ పరిస్థితి వచ్చింది. 


ఏపీ, తెలంగాణాలో కూడా నాయకుల తిట్ల పురాణం మాములుగా లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అనే కనీస ఆలోచన లేకుండా కనీసం వినడానికి, రాయడానికి వీలు లేని మాటలు మాట్లాడుతూ అదే నేటి ఫ్యాషన్ అన్నట్టుగా పరిస్థితిని తీసుకువచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు చేతకాని వాళ్లు లుచ్చాగాళ్లు అంటూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్దాయిలో మాట్టాడడం ప్రజలకు మింగుడుపడడంలేదు. ఒకప్పుడు మర్యాదకు గౌరవాలకు స్దానం ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రాజకీయాలు మరీ దారుణంగా మారాయి. 

Image result for chandrababu

వ్యక్తిగత విమర్శలకు గతంలోనూ తావున్నా ఇప్పుడవి తారాస్దాయికి చేరాయి. ఇది ఆ పార్టీకీ ఈ పార్టీకి అని కాదు. ఆ వ్యక్తి ఈ వ్యక్తీ అని కాదు. అన్నీ పార్టీలోను ఇదే పరిస్థితి. అలాగే ఏపీ విషయానికి వస్తే... టీడీపీ నాయకులు వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుని తిట్ల పురాణం విప్పుతున్నారు. గజదొంగ, మోసగాడు అని టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన టీడీపీ అధినేత ఏమి మాట్లాడకపోవడం, కనీసం  స్పందించకపోవడం నేటి రాజకీయ పరిస్థితికి అర్ధం పడుతోంది. 

Image result for ys jagan

అసలే రాజకీయాలంటే అందరికి అసహ్యం కలిగే పరిస్థితి వచ్చింది. ఇక నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శల వల్ల‌ ప్రజల్లో మరింత  చులకన భావన ఏర్పడింది.  తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభమైన ఈ తిట్ల దాడి తెలంగాణ వచ్చిన తర్వాత... ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మారలేదు. ఇక్కడి అధికార పార్టీ నాయకులే కాదు ప్రతిపక్షాలకు చెందిన వారు ఆ మాటకొస్తే నిన్న మొన్న పుట్టిన పార్టీల నాయకులు కూడా ఇదే భాషను వాడుతున్నారు. ఇవన్నీరాజకీయాల మీద ప్రజల్లో ఒకరకమైన దురభిప్రాయాన్ని కలిగిస్తాయి. రాజకీయాల్లోకి రావాలంటే తిట్లు తిట్టడమే ప్రధాన అర్హతగా అందరూ భావించే పరిస్థితికి తీసుకువచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: