రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుంది. లేకపోతే మనుగడే కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అన్ని పార్టీలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదునుపెట్టుకుంటూ.. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అటువంటి కొత్త ఎత్తుగడలు వేసే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణ లో అధికార పార్టీ మంచి దూకుడు మీద ఉంది. ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్నో ప్రజాకర్షక పథకాలకు రూపకల్పన చేసి మరీ అమలు చేస్తూ గులాబీ బాస్ గుబులు పుట్టిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా అధికార పీఠం దక్కించుకోవాలనే కసితో ఉన్న కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ కి ముచ్చెమటలు పుట్టిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ టీఆరఎస్ ఓటు బ్యాంక్ మీద దెబ్బకొట్టేలా ప్రజలను ఆకర్షించే పనిలో పడింది. 


ఏదైతే కేసీఆర్ కి బలం అవుతోందో, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టిపెడుతోంది. ఇదే అంశమై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ ఇటీవలే నివేదిక తయారు చేసి, పీసీసీ ముందుంచింది. ఫించన్ దారులను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగితే. ఓటు బ్యాంకును అనూహ్యంగా పెంచుకోవచ్చనే అంచనాకి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని నేతలు ఓ వ్యూహం సిద్ధం చేశారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈ మధ్య సంక్షేమ కార్యక్రమాలపై మరింత శ్రద్ధ పెడుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున లబ్ధిదారులకు పించెన్లు అందిస్తోంది. అయితే, టి. కాంగ్రెస్ లెక్క ప్రకారం. ఈ పింఛెనుదారులందరినీ తెరాస ఓటు బ్యాంకుగా చూస్తోంది. 

Image result for వికలాంగుల పెన్షన్ల

ప్రస్తుతం 65 ఏళ్లు నిండినవారికే కేసీఆర్ సర్కారు వృద్ధాప్య పింఛెను ఇస్తోంది. ఈ వయసు 58కి తగ్గించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే 58 నిండిన వాళ్లందరికీ వృధాప్య పెన్షన్ వస్తుందని హామీ ఇవ్వనున్నారు. దీంతో ఆ ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం తెరాస ఇస్తున్న పెన్షన్ రూ. 1000ని రూ. 2000లకు పెంచబోతున్నట్టు కూడా ప్రకటించారు. వికలాంగుల పెన్షన్ల ప్రస్తుతం రూ. 1500 ఇస్తోంది కేసీఆర్ సర్కారు. దీన్ని కూడా రెండింతలు చేస్తామని ఉత్తమ్ అంటున్నారు.


అలాగే చేనేత కార్మికులు, ఇతర చేతి వృత్తుల వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను డబుల్ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు. ఇలా అందరికీ పెన్షన్లను భారీగా పెంచుతామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో టీపీసీసీలోగానీ, ఇతర చోట్లగానీ నిరుద్యోగులుగా నమోదు అయినవారి సంఖ్య 15 లక్షలకు పైచిలుకు ఉందనీ, వీరిలో కొన్ని అర్హతలను పరిగణనలోకి తీసుకుని పది లక్షలమంది నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగభృతి ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు! ఇలా ప్రతి పథకంలోనూ కేసీఆర్ కి పోటీగా కాంగ్రెస్ హామీలు ఇస్తోంది.అయితే కాంగ్రెస్ ప్రకటిస్తున్న పథకాలు అమలు సాధ్యమా అనే విషయం పక్కనపెడితే కేసీఆర్ ని ఎలా అయినా గద్దె దించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే కసి కాంగ్రెస్ లో కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: