ప్రతిపండుగకు మానవేతిహాసంలో ఎదో మూలం ఉంటుంది. మతమేదైనా దేశమేదైనా ప్రజలు చేసుకునే పండుగలకు చరిత్రాత్మక చరిత్రలు ఉండవని అనటానికి ముస్లిం ఇతిహాసం చెప్పే ఈ చరిత్రాత్మక సంఘటనే బక్రీద్ కు మూలం. 
story of bakrid కోసం చిత్ర ఫలితం
"ఈదుల్ అల్ ఆధా" అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ. ఈ పండుగనే 'బక్రీద్’ అంటారు. బక్రీద్ అనే ఈ పండుగను ఎలా ఎందుకు జరుపుకుంటా రనే దానికి సమాధానంగా ఒక కథ ప్రచారంలో ఉంది. మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వు" అని ఆదేసిస్తాడు. 
bakrid pratyekata కోసం చిత్ర ఫలితం
స్వప్నం తరవాత నిద్ర నుంచి మేల్కొన్న హజ్రత్ ఇబ్రహీం తన భార్యకు తరవాత  తన కుమారుడు ఇస్మాయిల్‌ కు ఈ సంగతి తెలియజేయడంతో, అల్లాకు అపురూప భక్తుడైన ఇస్మాయిల్ తాను బలవడానికి సిద్ధమేనని చెబుతాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో అకస్మాత్ గా ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం స్థానంలో అల్లాకు గొర్రె బలౌతుంది. దానికి గుర్తుగా ముస్లిం సోదరులు బక్రీద్(బక్రా అనగా గొర్రె + ఈద్ అనగా పండగ) పండుగను జరుపుకుంటున్నారు. 
story of bakrid కోసం చిత్ర ఫలితం
బక్రీద్ పండుగను పురస్కరించుకుని పండుగకు ముందు రోజున మరణించిన వారి గోరీల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను, ఇతర వస్తువులను ఉంచు తారు. ఇలా ఉంచితే వారు దివి నుంచి వాటిని గుర్తించి స్వీకరిస్తారని నమ్మకం. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో బందువులకు స్నేహితులకే కాదు నిరుపేదలందరికి లేదన కుండా పంచటం ఆనవాయితీ. 
story of bakrid కోసం చిత్ర ఫలితం
మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. మరి ఈ ఆగష్ట్ నెల 22న రానున్న బక్రీద్ సందర్భంగా శుభం కలగాలని ఆశిస్తూ ముస్లిం సోదరులందరికీ "ఈద్ ముబారక్" తో శుభాకాంక్షలు తెలియజేద్దాము.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: