బక్రీద్ పండుగ రోజున తమ స్థాయికి తగ్గట్టుగా ముస్లిం సోదరులు మేకను కోసి   హలాల్‌ చేసిన వీటి మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, ఫకీర్లకు దానం చేసి, రెండో భాగాన్ని ఇరుగు పొరుగువారికి పంచి పడతారు. మూడోభాగాన్ని ఆయా కుటుంబాలు వండు కుని బంధు మిత్రులతో కల్సి విందు చేసుకుంటారు.  బక్రీద్‌ రోజు ఈద్దాలో ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్ధనలు చేసిన అనంతరం మాత్రమే ఖుర్భానీ చేసిన జంతు మాంసాన్ని భుజించాలన్న నియమంతో పాటు ఆ జంతు చర్మాన్ని ఇతరులకు దానం చేయాలన్న నియమం కూడా ఖచ్చితంగా పాటిస్తారు. 

Image result for bakra eid 2018

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం గోవధపై నిషేధం నేపధ్యంలో ఆవులను, ఆవు దూడలను కబేళాలకు అమ్మడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేదించారు.  హదీష్ షరీఫ్‌లో ఖుర్బానీ విశిష్టతను చాలా ఘనంగా ప్రశంసించారు. దివ్య ఖురాన్‌లో కూడా ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి గురించి పొగడ్త ఉంది. 

Image result for bakra eid 2018

ఖుర్బానీ జంతువు రక్తపు బిందువు భూమిపై పడక ముందే ఖుర్బానీ చేసే వ్యక్తి పాపాలన్నీ నశించిపోతాయి. ఖుర్బానీ జంతువు ఒక్కో రోమంలో ఒక్కో పుణ్యం లభిస్తుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఈ పండగ రోజు ప్రత్యేక నమాజ్ త్వరగా అంటే పది గంటల లోపే చదువుతారు. సాధ్యమైనంత వరకు ఏం తినకుండా ప్రార్థనకు వెళతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: