మహానేత భరతమాత ముద్దుబిడ్డ అటల్ బీహార్ వాజ్‌పేయి  3 సార్లు ప్రధాని పదవి వరించింది.   ఒత్తిళ్లు, ఆటుపోట్ల నడుమ తొలి రెండు పర్యాయాలు పదవిలో కొనసాగినా.. మూడోసారి మాత్రం పూర్తిగా ఐదేళ్ల పాటు ప్రధాని బాధ్యతలు నిర్వర్తించగలిగారు. 1995 మార్చిలో గుజరాత్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. 1994లో కర్ణాటక ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ జయకేతనం ఎగురవేసింది. అలా జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.   1995 నవంబరులో ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో అప్పటి పార్టీ అధ్యక్షుడు ఆడ్వాణీ.. వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.
Image result for atal bihari vajpayee parliament
అప్పటికే జోరులో ఉన్న ఆ పార్టీ 1996 ఎన్నికల్లో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు వాజ్‌పేయి భారత 10వ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఇక వాజ్ పేయీ ప్రధానిగా ఉన్నా..ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రజలకు మేలు చేసే విషయాల్లో ఎక్కడా తగ్గకుండా ఉండేవారు. 
Image result for atal bihari vajpayee parliament
వాజ్‌పేయి 1973లో ఎడ్లబండిలో పార్లమెంటుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పెట్రోలు, కిరోసిన్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఆయన ఎడ్లబండిలో పార్లమెంటుకు చేరుకున్నారు.  అయితే అంతకు ముందే ఇందిరాగాంధీ గుర్రపు బగ్గీపై ఢిల్లీలో పర్యటించి.. పెట్రోలు వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇంధన వాడకాన్ని తగ్గించి సహకరించాలని కోరారు. మరుసటి రోజు వాజ్ పాయి ఎడ్లండిపై రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  అంతే కాదు వాజ్ పాయిని చాలా మంది నేతలు ఫాలో అయ్యారు.  అంతెందుకు పెట్రోల్ రేటు పెరిగినప్పుడల్లా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు ఇలా రావడం నేతలకు పరిపాటిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: