ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీలలో ఉన్న గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలలో ఒక పార్టీ తరుపున గెలిచి అధికార పార్టీ లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఈ వివాదాలు మరీ తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో భూమా అఖిల ప్రియ- సుబ్బారెడ్డి ల మధ్య జరిగిన వివాదం పరిష్కరించడానికి తలలు పట్టుకున్న చంద్రబాబు కి తాజాగా కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి-రామ సుబ్బారెడ్డి మధ్య పోరు మరింత తలనొప్పి తీసుకువచ్చింది బాబు గారికి.

Image result for bhuma akhila vs

గత ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది...ఈ క్రమంలో కడప జిల్లాలో ఆధిపత్య పోరు కోసం మంత్రి ఆదినారాయణరెడ్డి అలాగే టిడిపి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య పోరు మొదలైపోయింది.

Image result for adinarayana reddy

ముఖ్యంగా ఆదాయంలో సగం సగం పంచుకుని సంతోషంగా ఉండండి అని ముఖ్యమంత్రి తెలియజేశారని అప్పట్లో ఆదినారాయణరెడ్డి చెప్పడం జరిగింది. ఈ వివాదం ఎలా ఉంటే ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు టికెట్ కోసం ఇప్పటి నుంచే సిగపట్లకు దిగుతున్నారు.

Image result for adinarayana reddy

అయితే మరోపక్క గత ఎన్నికలలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఆదినారాయణ రెడ్డిని గెలిపిస్తే ..టీడీపీలోకి వెళ్లిన నేపద్యంలో.. వచ్చే ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిస్తామని జమ్మలమడుగు నియోజక వర్గ ప్రజలే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: