ఆమ‌ధ్య వ‌చ్చిన అప‌రిచితుడు సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరో  క్యారెక్ట‌ర్   రెండు ర‌కాలుగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా  అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినామాల్లో ఎన్ని క్యారెక్ట‌ర్లు వేసినా ఇబ్బంది  లేదు కానీ నిజ‌జీవితంలో కూడా అలాగే బిహేవ్ చేస్తుండ‌ట‌మే స‌మ‌స్య‌గా మారింది. 


జ‌గ‌న్ ను విమ‌ర్శించిన ప‌వ‌న్

Image result for jagan and pawan

చంద్ర‌బాబునాయుడుతో క‌లిసి ఉన్నంత వ‌రకూ ప్ర‌తీ విష‌యంలోనూ వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించేవారు.  జ‌గ‌న్ ఇచ్చే హామీల‌కు రాష్ట్ర బ‌డ్జెట్ స‌రిపోద‌న్నారు.  జ‌నాలు ఏద‌డిగినా ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత చేస్తానంటూ  హామీలివ్వ‌టాన్ని ప‌వన్  త‌ప్ప‌ప‌ట్టారు. వార‌స‌త్వ హోదాలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ త‌ర్వాత ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారంటూ మండిప‌డేవారు. సిఎం అవ్వాలంటే అనుభ‌వం ఉండాల‌ని కూడా బుద్ద‌లు చెప్పారు లేండి. 


ఎంచ‌క్కా కాపీ కొట్టేస్తున్నారో 


అస‌లు ముఖ్య‌మంత్ర‌వ్వ‌టానికి జ‌గ‌న్ కు ఏమి అనుభం ఉందంటూ బ‌హిరంగంగానే నిల‌దీసేవారు.  ప‌వ‌న్ అడిగిందంతా నిజ‌మే క‌దా అని అంద‌రూ అనుకున్నారు.  సీన్ క‌ట్ చేస్తే ఇపుడు ఏం జ‌రుగుతోందో చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ ను ఏ పాయింట్ల మీదైతే నిల‌దీశారో ఇపుడు అవే పాయింట్ల‌ను ప‌వ‌న్ కూడా ఎంచ‌క్క  కాపీ కొట్టేసి ఫాలో అయిపోతున్నారు.


తాను మాత్రం  సిఎం అయిపోవాల‌ట ! 

Related image

కొద్ది రోజులుగా బ‌హిరంగ స‌భ‌ల్లో చేస్తున్న ప్ర‌సంగాలను వింటున్న జ‌నాలు విస్తుపోతున్నారు. ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ ఇస్తున్న హామీలేంటో అంద‌రూ చూస్తున్న‌దే. మ‌రి ఏ హోదాలో హామీలిస్తున్నారో ప‌వ‌నే చెప్పాలి.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేస్తే జ‌నాల‌కు చాలా చేసేస్తానంటూ హామీల‌ను గుప్పించేస్తున్నారు. ఏమ‌నుభ‌వం ఉంద‌ని త‌న‌ను జ‌నాలు ముఖ్య‌మంత్రిని చేయాల‌ని అడుగుతున్నారో ప‌వ‌నే చెప్పాలి. 


ఎంత‌కాలం ఈ అప‌రిచితుడు క్యారెక్ట‌ర్ 


జ‌గ‌న్ ను ప‌వ‌న్  టార్గెట్ చేసిన‌ప్ప‌టికి ఇప్ప‌టికీ తేడా ఒక‌టి క‌న‌బ‌డుతోంది. అదేమిటంటే అప్ప‌ట్లో ప‌వ‌న్ అనే జ‌న‌సేనాని చంద్ర‌బాబునాయుడు జేబులోని మ‌నిషిగా చెలామ‌ణి అయ్యేవారు. కాబ‌ట్టి అప్ప‌ట్లో ప‌వ‌న్  చేసిన ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌ల‌న్నీ టిడిపి మౌత్ పీస్ గా చేసిన‌వే. చంద్రబాబు నుండి దూరంగా వ‌చ్చేసిన త‌ర్వాత (క‌నీసం బ‌య‌ట‌కన్నా ) మాట్లాడేద‌న్నా నిజ‌లేనా లేక‌పోతే అప‌ర‌చితుడులా  ఎప్ప‌టిక‌ప్పుడు మాట‌లు మారిపోతుంటాయా ?  చూడాల్సిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: