పవన్ కళ్యాణ్ ఇప్పటికి నూట పాతిక సార్లు చెప్పాడు నేను మొదట భారతీయుడిని తరువాత ఇంకేదన్నా అని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసాడు. నన్ను ఒక కులానికి అంటగడితే ఊరుకోనని కూడా చాలా సార్లు చెప్పాడు. అయినా ఇప్పటికి చాలా మంది పవన్ కు కాపు కులాన్ని అంట గట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ప‌లు కుల సంఘాల‌ను క‌లుస్తూ వారి క‌ష్టన‌ష్టాల‌ను తెల్సుకుంటున్నారు.

Image result for pavan kalyan jansena

ఇందులో భాగంగా బీసీలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, మ‌త్స్యకారులు, ఇత‌ర కులాల వారిని క‌లిసి వారిలో ఒక‌డిగా మెలిగారు. వారి క‌ష్టాల‌ను త‌న క‌ష్టాలుగా అనుభ‌వించి, భావించి అన్ని కులాల కోసం ప్రత్యేక కార్పొరేష‌న్లు, ఇత‌ర‌త్రా సంక్షేమ ప‌థ‌కాలు ప్రవేశ పెడుతాన‌ని హామీలిస్తూ ఆక‌ట్టుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీసీల‌కు ఐదుశాతం రిజ‌ర్వేష‌న్ల పెంపుద‌ల‌, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేలా 9వ షెడ్యూల్‌లో చేర్పు, మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న‌కు బిల్లు తీసుకురావ‌డం త‌దిత‌ర హామీల‌ను ఇస్తూ మ్యానిఫెస్టోలో కూడా చేర్చారు.

Image result for pavan kalyan jansena

ఇదిలా ఉంటే... గుంటూరు జిల్లా తెనాలిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట చైర్మన్ కేస‌న శంక‌ర‌రావు విలేక‌రుల‌తో మాట్లాడుతూ ప‌వ‌న్ తాను నూటికి నూరుపాళ్లు కాపునాయ కుడినేన‌ని మావూళ్ల‌మ్మ దేవ‌త సాక్షిగా ప్రక‌టించుకున్నార‌ని స్పష్టం చేశారు. ఇటీవ‌ల న‌ర‌సాపురం స‌భ‌లో కాపుల‌ను బీసీల్లో చేర్చాలంటే బీసీల‌కు, కాదంటే కాపుల‌కు కోపం అని అన్నార‌ని ఆయ‌న గుర్తుచేశారు. ప‌వ‌న్ కుల‌, ఓట్ల రాజ‌కీయాలు చేస్తున్నార‌ని బీసీ నాయ‌కుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: