దాదాపు పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదలకు ఒక్క గురు,శుక్రవారాల్లో 32 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఆగస్టు 8 నుంచి ఇప్పటిదాకా వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 105కు చేరుకుంది. కాగ, కేరళ పునర్నిర్మాణానికి విరాళాలు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  కేరళలోని వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం సహాయం అందించడానికి ముందుకు వచ్చింది.  ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.


కేరళ బాధితుల కోసం రూ.25 కోట్ల తక్షణ సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఈ మొతాన్ని కేరళ ప్రభుత్వానికి అందించాలని తెలంగాణ సీఎస్ జోషిని ఆదేశించారు. అంతే కాదు  వరదల వల్ల జలకాలుష్యం అయిన ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఆర్వో యంత్రాలను కేరళకు పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ప్రకటనతో శనివారం వరకు 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రధాని మోదీకి వివరించారు.

Image result for kerala floods

1200 కోట్ల తక్షణ సాయం అడగగా, కేంద్రం 100 కోట్లు ఇచ్చింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాణాలను దక్కించుకోడానికి వందలాది మంది ప్రజలు ఇంటి పైకప్పులు, పొడవైన భవంతులపైకి ఎక్కి తలదాంచుకుంటున్నారు.

Image result for kerala floods

ఒక మారుమూల చర్చిలో కొందరు తలదాచుకున్నట్టు పేర్కొన్నారు.తెలంగాణ తరపున కేరళకు సహాయనిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ వెల్లడించారు. ఇబ్బందుల్లో ఉన్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా తమకు ఉందని అన్నారు. ఈ విపత్తు కారణంగా కేరళలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి కేరళ రాష్ట్రం తొందరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: