ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పడం చాలాసందర్భాలలో జరిగింది. ఇక్కడ ఎంపీలు గెలిచి అక్కడ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన సంఘటలూ అనేకం ఉన్నాయి. అలా  చంద్రబాబు, , వైఎస్సార్ పెద్ద ఎత్తుల ఎంపీలను ఉమ్మడి ఏపీలో ఇచ్చి రాష్త్రాన్ని బాగు చేసుకున్నారు. విభజన ఏపీలోనూ రేపు ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే పార్టీ డిల్లీలో చక్రం తిపడం ఖాయంగా కనిపిస్తోంది. అది మేమే  అంటున్నారు వైసీపీ అధినేత జగన్


డ్యాం ష్యూర్ గా మేమే :


ఏపీలో 2019 ఎన్నికలలో పెద్ద మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ అధినేత జగన్ ధీమాగా చెప్పారు. ఓ జాతీయ పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటెర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఏపీలో గెలిచేది, నిలిచేదీ మేమేనంటూ బల్ల గుద్ది మరీ చెప్పారు. టీడీపీకి దారుణమైన పరాభవం ఎదురుకాబోతోందని జోస్యం చెప్పారు.


ఇదీ లెక్క :


ఏపీలో వచ్చే ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా సాగుతాయని జగన్ కచ్చితమైన అంచనా వేశారు. 2014 నాటికి చంద్రబాబు, తానూ ఇద్దరం అధికారంలో లేమని, నాటి కాంగ్రెస్ వ్యతిరేకతను అలా పంచుకున్నామని, బాబుకు బీజెపీ, పవన్ సపోర్ట్ వల్ల చాలా తక్కువలో తాము అధికారం పోగొట్టుకున్నామని జగన్ చెప్పారు. ఈసారి అలాంటి పరిస్తితి లేనే లేదని, తాము ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంప్లీట్ గా పొందుతామని అన్నారు. పైగా బీజేపీ, పవన్ లేని చంద్రబాబుకు ఓటమి ఖాయమని కూడా చెప్పేశారు. హామీలు నెరవేర్చని ఈ సర్కార్ ని సాగనంపడానికి ప్రజలు రెడీగా ఉన్నారని, తన పాదయాత్రలో అది కళ్ళకు కట్టినట్లుగా కనిపించిందని జగన్ చెప్పుకొచ్చారు.


హోదా ఇచ్చిన వారికే :


వచ్చే ఎన్నికలలో తాము ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నామని ఆయన చెప్పారు. కేంద్రంలో మోడీ అయినా, రాహుల్ అయినా పీఎం కానీయండి, ఏపీకి హోదా ఎవరు ఇస్తే వారికే మా మద్దతు అంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఏపీ విషయానికి వస్తే హంగ్ వచ్చే సమస్యే లేదని, జనం ఏకపక్షంగా వైసీపీకే జై కొడతారని జగన్ అంటున్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి, ఏపీ శాసనసభలో ప్రతిపక్షనాయకునిగా ఉన్న తాను పదేళ్ళుగా ప్రజా జీవితంలోనే ఉన్నానని జగన్ చెప్పారు. తనకు అనుభవం లేదని ఎవరైనా అంటే అది ఉత్త ఆరోపణే కాగలదని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: