కాపులను బీసీల్లో చేర్చాలంటూ .. కొద్ది సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నా దాని మీద పెద్దగా ముందుకు వెళ్ళింది లేదు. గత ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టోలో ఉన్న ఈ హామీని అమలు చేయాలంటూ ఆ సామజిక వర్గం వారు రోడ్లెక్కి మరీ ఉద్యమాలు చేసారు. అయినా పెద్దగా స్పందన అయితే రాలేదు. ఆ తరువాత కాలక్రమేణా ఆ ఉద్యమం చల్లారిపోయింది.అడపాదడపా దాని మీద చర్చలు జరిగినా పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే అనూహ్యంగా కొద్ది రోజుల క్రితం ఈ సున్నితమైన అంశాన్ని వైసీపీ అధినేత జగన్ కదపడంతో మళ్ళీ కాక మొదలయ్యింది. 


ఇక ఇప్పుడు అన్ని పార్టీలు ఈ అంశంపై తప్పనిసరిగా తమ వైకిరి ఏంటి అనేది చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ అంశం తీవ్రంగా ప్రభావం చూపించే ఛాన్స్ కనిపిస్తోంది. మెజార్టీ ఓటర్లుగా ఉన్న కాపులను వదులుకునేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. అంతెందుకు కాపులకు రిజర్వేషన్స్ ఇవ్వలేను అని చేతులెత్తేసిన జగన్ కూడా ఆఖరికి యూ టర్న్ తీసుకుని మరీ కాపులకు మద్దతుగా రాగం అందుకున్నాడు. 


ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని గట్టిగా పట్టుకోవాలని భావిస్తున్న ముద్రగడ టీడీపీ ముందు ఓ ప్రతిపదాన ఉంచినట్టుగా వాతలు వస్తున్నాయి. 'బీసీలు అడ్డుపడుతున్నారని, కేంద్రం నాన్చుతోందని కథలు చెప్పడం మానండి..' అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కు చురక వేసాడు ముద్రగడ. కోటా ఇస్తామంటూ 2014లో మీరే మమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారు. మీవల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు సరిదిద్దుకునే బాధ్యత కూడా మీమీదే ఉంది అంటూ ముద్రగడ చెప్పుకొస్తున్నారు.  


బీసీ-ఎఫ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే తాత్కాలిక వర్గీకరణ చేసి.. తహసీల్దార్ల నుంచి కాపులకు కాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పించాలన్నది ముద్రగడ సూచన. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్న బాబు దీనిమీద స్పష్టమైన నిర్నయాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ముద్రగడ చేసిన బీసీ ఎఫ్ సర్టిఫికెట్ అంశం పై బాబు ఆలోచనలో పడ్డాడు. అయితే అలా చేస్తే బీసీల నుంచి మొదలయ్యే ఎదురుదాడి ఇలా అన్నిటిని లెక్కలు వేసుకుని దీనిపై ఏదో ఒక నిర్ణయం వీలైనంత తొందరగా తీసుకోవాలని బాబు ఆలోచనలో పడ్డాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: