అటు తిరిగీ ఇటు తిరిగీ మొత్తానికి కాపుల అంశం మళ్ళీ చంద్రబాబు మెడకే  చుట్టుకుంటోంది. ఈ మధ్యన  కాపు రిజర్వేషన్లపై  జగన్ కుండబద్దలు కొట్టడంతో రాజకీయాలలో మళ్ళీ చిచ్చు రేపింది. జగన్ ఉన్నది చెప్పేసి సూప్ లో పడిపోయాడని టీడీపీ మంత్రులు సంబరాలు చేసుకున్నారు. గోదావరి జిల్లాలలో వైసీపీ అవుట్ అని తేల్చేశారు. మరిపుడు సీన్ రివర్స్ అవుతోందట.


అది చేసిన తరువాతే :


కాపుల అంశం ముందు తేల్చి ఆనక ఏపీలో పోస్టులను భర్తీ చేయాలంటూ  కాపు నాయకుడు ముద్రగడ సరి కొత్త పితలాటకం పెట్టారు. బాబుకు కాపుల అంశంపై చిత్తశుద్ధి లేంటంటూ లేటేస్ట్ గా ముద్రగడ ఫైర్ అవడంతో టీడీపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. బీసీ ఎఫ్ లో కాపులను చేర్చామంటున్న బాబు కొత్త పొస్టింగులలో ఆ రిజర్వేషన్లు వర్తింపచేస్తారా అంటూ పెద్ద ప్రశ్నే వేశారు. అలా చేయకుంటే టీడీపీ పైనే పోరాడుతామంటూ భారీ స్టేట్మెంట్ ఇవ్వడంతో పసుపు పార్టీలో అలజడి రేగుతోంది.


అందుకే ఇలా :


నిజానికి వైఎస్ జగన్ చెప్పినదాంట్లో తప్పు లేదన్నది కాపు యువత భావన. కాపుల రిజర్వేషన్ కేంద్ర పరిధిలో ఉందని, తాను చేయగలిగిందే చెప్తానటూ జగన్ సత్యమైన మాట చెప్పారని కాపు యూత్ నమ్ముతున్నారు. దానికి భిన్నంగా ఆ రోజున ముద్రగడ జగన్ పై మండిపడడం జరిగింది. అయితే విషయంలో అపుడు ముద్రగడే  కొంత ఇబ్బందిపడ్డారు. అందువల్లనే  అసలు కాపుల విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటన్నది మరో మారు ముద్రగడ ప్రశ్నించాల్సి వచ్చిందంటున్నారు. మొత్తానికి కాపుల విషయంలో బాబుకు ఇరకాటం తప్పేట్లు లేదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: