వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసుకున్న తెలంగాణా సీఎం కేసీఆర్ సెప్టెంబర్ లో ప్రకటించేస్తానని చెప్పడంతో ఆ పార్టీలో ఎన్నికల సందడి మొదలయిపోయినట్టు కనిపిస్తోంది. అభ్యర్థుల లిస్ట్ ముందుగానే ప్రకటించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకున్న తరువాతనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అనేక రాజకీయ విశ్లేషణలో బయటపడింది. అయితే ఇప్పడు అదే వ్యూహాన్ని ఏపీ టీడీపీలో అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన. అన్ని విషయాల్లోనూ కేసీఆర్ తో పోటీ పడే బాబు ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే ఫాలో అవ్వాలని చూస్తున్నాడు. 


కానీ బాబు నిర్ణయం టీడీపీకి చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయానికి విరుద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే... ఎప్పుడూ ఎన్నికల చివరి నిమిషం వరకు అభ్యర్థుల లిస్ట్ బయటపెట్టకుండా సస్పెన్సు కొనసాగించడం టీడీపీకి మొదటి నుంచి వస్తున్న అలవాటు.  అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ముందుకు వెళ్లాలని టీడీపీ చూస్తోంది. చివరిదాకా సస్పెన్సు లేకుండా లిస్ట్ రెడీ చేసి అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బాబు నిర్నయాయం తీసుకున్నాడు. ముందుగా ఓ 40 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో కూడా ఎక్కువ వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే ఉన్నాయట. 

Image result for chandra naidu

తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా ప్రయోగమనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలంటే ఇదే సరైన దారని బాబు ఆలోచన.  ప్రస్తుతం వైసిపి ఎమ్యెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దాదాపు వాళ్లకే టిక్కెట్లు వచ్చే అవకాశాలున్నాయి. అందుకనే టిడిపి నుండి పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. మిగతా సీట్లలో కూడా అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసే పనిలో బాబు అండ్ కో బృందం ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే సర్వే రిపోర్టులు, ఇంటలిజెన్స్ రిపోర్టులు సిద్ధం చేసుకున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు , సామాజిక వర్గాల లెక్కలు ఇలా అన్నిటిని బేరీజు వేసుకుని వీలైనంత తొందరగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేందుకు బాబు చూస్తున్నాడు.  


చివరి నిమిషంలో కానీ చంద్రబాబు ఎవరికీ టిక్కెట్లను ప్రకటించరన్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్ల చాలా నియోజకవర్గాల్లో నేతలు టెన్షన్ పెరిగిపోతుంటుంది. చివరి నిమిషంలో టిక్కెట్లను ప్రకటించటంతో అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకం. కాబట్టి అభ్యర్ధులను ముందుగా ప్రకటిస్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయని, అభ్యర్థులు కూడా ధైర్యంగా జనాల్లో తిరుగుతూ తమ పలుకుబడి పెంచుకోవడానికి కుదురుతుందని బాబు ఆలోచన.


మరింత సమాచారం తెలుసుకోండి: