తిరుపతి వెంకన్న సన్నిధికి ఈ రోజు అనుకోని భక్తుడు వచ్చారు. సుప్రభాత సేవలో స్వామిని దర్శించుకున్న ఆయన మొక్కులన్నీ చెల్లించుకున్నారు. అందరి మాదిరిగానే ఆ దేవదేవున్ని కొన్ని వరాలూ కోరుకున్నారు. అయితే అవి తన కోసం మాత్రం కాదు. బావ కళ్ళలో ఆనందం చూడాలని తపించిన ఈ బావమరిది దేశానికి అతి పెద్ద కుటుంబమైన ఓ పాపులర్ పొలిటికల్ ఫిగర్ ఇంటల్లుడు.


ఆయనొస్తేనే మార్పు :


ఈ దేశంలో అన్ని బాగుంటాయి. అంతా బాగా జరుగుతుంది. కొద్ది రోజులు పోతే అంతా మంచే జరుగుతుందని ఏకంగా తిరుమల కొండపై జొస్యం చెప్పిన ఆయన అచ్చంగా కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు  సోనియమ్మ అల్లుడు, ఇప్పటి ప్రెసిడెంట్ రాహుల్ బావమరిది. ఉన్నట్లుండి ఇలా తిరుమలలో ప్రత్యక్షం అయిన రాబర్ట్ వాద్రా అచ్చమైన హిందువు మాదిరిగా కనిపించాడు. వచ్చే ఎన్నికలలో తన బావ రాహుల్ ప్రధాని అవుతారంటూ హింట్ ఇచ్చిన ఆయన దేశం బాగుపడుతుందన్న మాట అలా వాడారన్న మాట.. రాహుల్ వస్తేనే  అన్నిటా మార్పు వస్తుందని కూడా చెప్పారు.


వారి కోసమే మొక్కులు :


తన అత్తమ్మ సోనియగాంధి ఆరోగ్యం బాగుందాలని, కేంద్రంలో కాగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ ప్రధాని కావాలని మొక్కుకున్నట్లు చెప్పిన రాబర్ట్ వాద్రా ప్రజల కోసం మాత్రం ఏం మొక్కుకోలేదు. ఎందుచేతనంటే ఆయన చెప్పినట్లుగా కాంగ్రెస్ వస్తే దేశం బాగుపడుతుంది, అందులో ప్రజలూ బాగు పడతారు కాబట్టి. మొత్తానికి క్రైస్తవ మత విశ్వాసం కలిగిన రాబర్ట్ వాద్రా ఇలా తిరుమల వచ్చి వెంకన్నకు మొక్కులు చెల్లించడం విశేషమే మరి. ఇప్పటివరకూ బావ రాహుల్ తిరిగారు, ఇపుడు బావమరిది గుళ్ళూ గోపురాలు తిరుగుతారన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: