ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐ టి శాఖా మంత్రి లోకేష్ ఇంకా చెప్పాలంటే చంద్ర బాబు ముద్దుల తనయుడు నారా లోకేష్ ప్రతి సారి తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లి పోతున్నాడు. ఒక పని చేసే ముందు కనీసం విమర్శలు వస్తాయన్న సంగతీ కూడా లోకేష్ గ్రహించ లేక పోతున్నాడు. మంత్రిహోదాలో ఉండి డాబా మీద కుటుంబ సభ్యులతో కలిసి జెండా ఎగరేసిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదు.

Image result for lokesh

ఇలా చేస్తే నవ్వుల పాలవుతానని ఆయనకు తెలియదా? చంద్రబాబుకు చెప్పకుండానే ఈ పని చేశాడా? లేక ఆయనకు తెలిసినా గమ్మున ఉన్నారా? ఇక తాజాగా దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయికి నివాళి అర్పించిన తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. సంతాప సందేశంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేవడం వివాదాస్పదమైంది.

Image result for lokesh

ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసిన సందేశంలో 'దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. రాజకీయాల్లో, సాహిత్యంలో, దౌత్యనీతిలో ఆయనకు ఎవ్వరూ సాటిరారు. తెలుగు రాష్ట్రాలు ప్రియ స్నేహితుడిని కోల్పోయాయి. ఆయనతోపాటు చంద్రబాబు నాయుడు స్వప్నాలను సాకారం చేయడంలో తోడున్నారు' అని పేర్కొన్నాడు. ఈ పోస్టు చదవిన నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. సంతాప సందేశంలో తండ్రిని ప్రశంసించడమేమిటని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: