విశాఖ జిల్లాలో నర్శీపట్నం అసెంబ్లీకి ఓ ఇంపార్టెన్స్ ఉంది. మూడున్నర దశాబ్దాలుగా ఆ సీటు టీడీపీకి కంచు కోటలా ఉంటూ వస్తోంది. రెండు మార్లు తప్ప ఇప్పటికీ అక్కడ అజేయంగా గెలుస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యె మంత్రి అయ్యన్నపాత్రుడు. అటువంటి చోట  వైసీపీ సానుకూల పవనాలు ఇపుడు బలంగా  వీస్తున్నాయి. జగన్ పాదయాత్రకు ఎక్కడ చూసినా ప్రజలు వెల్లువలా హాజరవుతున్నారు. 


జనమే జనం :


విశాఖ జిల్లా పాదయాత్రలో భాగంగా జగన్ ఈ రోజు నర్శీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఎక్కడ చూసిన జనమే జనంగా కనిపించారు. అయ్యన్న ఇలాకాలో ఈ సీన్ చూస్తుంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఇక్కడ జెండా పాతేస్తుందా అనిపించేలా ఉంది. మొన్నటి ఎన్నికలలోనే కేవలం రెండు వేల ఓట్ల తేడాతో వైసీపీ క్యాండిడేట్ ఓడిపోయారు. జగన్ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సీటు టీడీపీ వదిలేసుకోవాల్సిందే అనిపిస్తోంది.


బాబు, అయ్యన్నలను నిలదీసిన జగన్ :


జిల్లాలోనూ, నర్శీపట్నంలోనూ జరిగిన అభివ్రుధ్ధి ఏంటో చెప్పాలంటూ మంత్రి అయ్యన్నను, సీఎం బాబుని  ఈ రోజు జరిగిన  మీటింగ్ లో నిలదీశారు. సెజ్ పెడితే ఉపాధి అన్నారు, ఏమైదంటూ అటాక్ చేశారు. పన్నులమోత తప్ప పనులు చేస్తున్నారా అంటూ నిగ్గ దీశారు. మునిసిపాలిటీలో అన్ని రకాల పన్నులూ పెంచేసి పేదల నడ్డి విరగ్గొడుతున్నారంటూ ఓ రేంజిలో  విరుచుకుపడ్డారు. మొత్తానికి విశాఖ జిల్లాలో జగన్ ఫస్ట్ మీటింగ్, అదీ మంత్రి ఇలాకాలో అదిరిపోయే రేంజిలో జరగడంతో వైసీపీ శ్రేణులు హుషారుగా ఉన్నాయి. 


సమస్యల తోరణం :


ఇక జగన్ ఈ రోజు పర్యటనలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో అనుసరించారు. తమ బాధలు, సమస్యలు చెప్పుకున్నారు. ఉపాధి లేక వలస పోతున్నామంటూ గోడుమన్నారు. పేదలకు ఇళ్ళు లేవని, రేషను కార్డులూ లేవని వాపోయారు. జగన్ వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తూ ముందుకు సాగారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: