పవన్ కళ్యాణ్ సభలలో ఎప్పుడు ఒకే విషయాన్ని చెబుతుంటాడు మార్పు కోసం పార్టీ పెట్టానని ఇప్పటివరకు ఉన్న రాజకీయాలను సమూలంగా మార్చి వేస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు మాత్రం సంప్రదాయ పార్టీల మాదిరిగా తన మేనిఫెస్టో ను విడుదల చేయడం తో తీవ్ర విమర్శలు ఎదురైనాయి.  ఫక్తు ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపే రాజకీయ పార్టీల్లానే జనసేన కూడా తయారయ్యింది..' అన్న మాట, 'మార్పు' కోరుకుంటున్నవారి నుంచి మాత్రమే కాదు, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల నుంచి కూడా విన్పిస్తుండడం గమనార్హం.

Image result for pavan kalyan jansena

గత కొద్ది రోజులుగా ఈ విజన్‌ డాక్యుమెంట్‌పై మీడియాలో జరుగుతున్న చర్చలు, సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న అభిప్రాయాలు.. వెరసి, జనసేన పార్టీలో దీనిపై 'పునరాలోచన' చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయట. 'బ్యాక్‌ ఫైర్‌' అవుతుందని ముందే అనుకున్నారో ఏమో, 'విజన్‌ డాక్యుమెంట్‌ మాత్రమే..' అంటూ కాస్తంత జాగ్రత్త పడినా, పేర్కొన్న 12 పాయింట్లలో ఒక్కటంటే ఒక్కటీ 'కొత్తగా' అన్పించకపోవడం పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్నీ పూర్తిగా నిరాశపర్చింది.

Image result for pavan kalyan jansena

మహిళలకు ఇస్తామని చెబుతున్న 'నగదు బదిలీ' ఆర్థిక సాయం దగ్గర్నుంచి, ఉచిత సిలెండర్‌ వరకు.. ఇవేవీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చేందుకు వచ్చే రాజకీయ పార్టీ నుంచి జనం ఆశించే 'విజన్‌' కానే కాదు. ఇప్పుడు డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలంటూ, విజన్‌ డాక్యుమెంట్‌కి రిపెయిర్లు షురూ చేసేశారు. వచ్చే వారంలోనే పూర్తి రిపెయిర్ల అనంతరం, కొత్త 'రి-విజన్‌' డాక్యుమెంట్‌ని జనసేన ప్రచారంలోకి తీసుకురాబోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: