దేశంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే లోక్ సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మోడీ షా ద్వయం ఆలోచిస్తోందని తెలుస్తోంది. అంటే లోక్ సభకు దాదాపు ఆరు నెలల ముందన్న మాట. దీని వల్ల కేంద్రంలోని బీజేపీకి ఒకే కానీ తెలుగు రాష్ట్రాలలో దెబ్బ ఎవరికి పడుతుందన్నది ఇంటెరెస్టింగ్ మ్యాటర్.


అలా కుదరనందునే :


నిజానికి వచ్చే ఏడాది మేలో జరిగే  లోక్ సభ ఎన్నికలతో పాటే నాలుగు అసెంబ్లీలకు నిర్వహించాలనుకున్నారు. కానీ గడువు తీరిన అసెంబ్లీల ఎన్నికలు వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అంటే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరాంల అసెంబ్లీలతో పాటే లోక్ సభ ఎన్నికలు జరిపేందుకు మాత్రం ఏ అడ్డూ ఉందదు. దాంతో లోక్ సభ ఎన్నికల‌నే ముందుకు జరపాలని చూస్తున్నారు. 


ఎవరికి లాభం :



ఒక్క లోక్ సభకు మాత్రమే ఎన్నికలు పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ పార్టీగా బరిలోకి దిగుతుంది. మోడీ ప్రధాని అన్న దాని మీదనే ఓటింగ్ జరుగుతుంది. నచ్చితే ఓటు వేయాలి. లేకపోతే రెండవ ఆప్షన్ ఉన్న మరో జాతీయ పార్టీ కూటమి కి వేయాలి. అలా చూసుకుంటే కాంగ్రెస్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో కొంత బెటర్ రిజల్ట్స్ వచ్చే చాన్స్ కనిపిస్తోంది.


జట్టు కడితే హిట్టేనా :


దేశవ్యాప్తంగా మోడీకి యాంటీగా కాంగ్రెస్, విపక్షాలు  కూటమి కట్టి ఆ ఎన్నికలలో ముందుకు వస్తాయి.  అలా  కనుక చూసుకుంటే  రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కి ఇప్పటికిపుడు మిత్రుడు అంటే తెలుగుదేశమే కనిపిస్తోంది. సో అక్కడా, ఇక్కడా కాంగ్రెస్ తో జట్టు కట్టి టీడీపీ లోక్ సభ ఎన్నికలలో పొటీ  చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే మోడీపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కూటమికే ప్లస్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ కూటమి వర్సెస్ కేసీయార్, మరో వైపు బీజేపీ ఉంటాయి.  జాతీయ రాజకీయాలు బాగా ప్రభావితమయ్యే లోక్ సభ ఎన్నికలు కాబట్టిఈ ట్రయాంగిల్ లో  కాంగ్రెస్ కూటమికి కొంత అనుకూలత ఉంటుంది.


ఇక్కడా అంతేనా :


ఇక ఏపీలోనూ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ముందు ఎంపీ సీట్లకే ఎన్నికలు వస్తే టీడీపీ కాంగ్రెస్ తో జట్టు కట్టి బరిలో ఉంటుంది. ఎటూ ప్రత్యేక హోదా అంశాన్ని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. మేము గెలిస్తే హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ ముందుకు వస్తుంది. దాంతో జట్టు కట్టిన టీడీపీ అదే చెబుతుంది. సో హోదా ఇవ్వని మోడీకి, బీజేపీకి ఎటూ ఏపీలో ఓట్లు పడవు, అపుడు ఇస్తామంటున్న కాంగ్రెస్, టీడీపీ ఉన్న కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే జరిగితే ఎంపీ సీట్లను ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కూటమి పెద్ద ఎత్తున గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.



 ఇక ఎంపీ ఎన్నికలు వేరుగా వస్తే మాత్రం  ఏపీలో ఒంటరిగా పోటీకి దిగనున్న వైసీపీ  భారీగానే నష్టపోవాల్సివుంటుంది. ఎందుచేతంటే ఓటర్ల సందేహాలకు  ఆ పార్టీ దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి. హోదా ఎలా తెస్తారు అన్న పశ్నకు ముందు సీట్లు ఇవ్వండి, ఆనక గెలిచి జట్టు కడతామంటే కుదరదు. రెడీమేడ్ గా కళ్ళ ముందు కనిపించే కాంగ్రెస్ కూటమికే జనం ఒటేసేందుకు అవకశాలు మెండుగా ఉంటాయి. ఇదంతా వైసీపీ జాతీయ పార్టీలతో పొత్తు విషయంలో  ఎటూ  తేల్ఛుకోక పోవడం వల్ల ఏర్పడిన సందిగ్దం నుంచి వచ్చే నష్టమన్న మాట. సరిగ్గా ఇక్కడే టీడీపీ తెలివిగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తో కలసి రావడం ఎంపీ సీట్ల ఎన్నికలకు ప్లస్ గా మారుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: