ప్ర‌స్తుతం ఇదే ప్ర‌శ్న అంద‌రినీ తొలుస్తోంది. గుంటూరు జిల్లాలో అత్యంత కీల‌క‌మైన చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంపై రాజ‌కీయ విశ్లేష‌కులు త‌లోరకంగా స్పందిస్తున్నారు. మ‌రికొన్ని మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు? ఎవ‌రు ఎమ్మెల్యే సీటులో కూర్చుంటారు? అనే చ‌ర్చ ఊపందుకుంది. ఇక్క‌డ ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం చ‌క్రం తిప్పుతోంది. వీరి ఓట్లు 39 వేలకు పైగానే ఉన్నాయి. ఇక‌, కాపులు 20 వేల కు పైచిలుకు ఉన్నారు. అదేవిధంగా రెడ్డి వ‌ర్గం 9 వేల ఓట్ల‌తో ఉంది. ఇక‌, అత్యంత ప్ర‌ధాన‌మైన మైనార్టీ ముస్లింల ఓట్లు కూడా గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల ప‌లితాల‌ను చూస్తే.. ఇక్క‌డ వ‌రుస‌గా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతోంది. 

Image result for ప్ర‌త్తిపాటి పుల్లారావు

టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్‌లో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో భారీగానే ఖ‌ర్చు చేసి ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ఆశీస్సుల‌తో ఆయ‌న మంత్రి ప‌ద‌విని కూడా కైవ‌సం చేసుకున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న వెంట ఉన్న‌వారంతా ఎన్నిక‌ల నాటికి ఉంటారా? అనేది సందేహంగా మారిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న గెలుపున‌కు కృషి చేసిన వారిని ప‌క్కన పెట్టి ఇప్పుడు త‌న‌కు భ‌జ‌న చేసేవారిని మాత్రమే కొత్త‌వారిని ఎంచుకుని మ‌రీ తిప్పుకొంటున్నార‌ని అంటున్నారు స్థానిక నాయ‌కులు. 

Image result for chandrababu

మంత్రిగా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆశించిన స్థాయిలో ఆయ‌న అభివృద్ధి చేయ‌లేద‌న్న‌ది వాస్త‌వం. జాతీయ ర‌హ‌దారి మీద ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అనువైన అనుకూలాంశాలు చాలా ఉన్నా ఆయ‌న ఈ దిశ‌గా చేసిన కార్యాచ‌ర‌ణ ఏమీ లేదు. ఇక‌, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న‌కు కూడా గ‌ట్టి కేడ‌రే ఉంది. 2004లో ఇక్క‌డ నుంచి ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాటి గెలుపొందారు. ఇక‌, 2014లోనూ ప్ర‌త్తిపాటివిజ‌యం సాధించారు. అయితే, ఈ రెండుసార్లు కూడా మెజారిటీలో కొంత మేర‌కు మార్పు క‌నిపించింది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల ప‌రిస్థితిని చూస్తే.. మంత్రి ప్ర‌త్తిపాటికి వ్య‌తిరేక సెగ బాగానే త‌గులుతోంది. కుటుంబ రాజ‌కీయాలు, అవినీతి, కేడ‌ర్‌లో స‌మ‌న్వ‌యం లేక పోవ‌డం వంటివి ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయి. 

Image result for మ‌ర్రి రాజ‌శేఖ‌ర్

మ‌రోవైపు క్లీన్ ఇమేజ్ ఉన్నా వైసీపీ నాయ‌కుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మ‌రింత‌గా దూకుడు రాజ‌కీయాలు చేయాల‌న్న అభిప్రాయం కూడా నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తోంది. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో న్యూట్ర‌ల్ జ‌నాల్లో ఆయ‌న‌పై సానుభూతి ప‌వ‌నాలు కూడా గ‌ట్టిగానే ఉన్నాయి. మ‌రి వీటిని మ‌ర్రి అందిపుచ్చుకుని స‌రైన వ్యూహాల‌తో ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఏదేమైనా ఈ సారి చిల‌క‌లూరిపేట‌లో మంత్రి పుల్లారావుకు అంత సానుకూల వాతావ‌ర‌ణం అయితే లేదు. మ‌రి దీనిని ఆయ‌న ఎలా అధిగ‌మిస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: