జనసేన రేపటి ఎన్నికలలో అధికారంలోకి వస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ బలాబలాలపై అంచనాలు వేసుకుంటున్నారా, అందరి మాదిరిగానే బయటకు ఎన్ని చెబుతున్నా అసలు విషయం పై ఆ పార్టీలో చర్చ జరుగుతోందా. అంటే అవుననే ఆన్సర్  వస్తోంది. వచ్చే ఎన్నికలలో జనసేన ఎన్ని సీట్లకు పోటీ పడుతుందన్నది ఇపుడు హాట్ టాపిక్.


ఆ సేట్లే కీలకమట :


వచ్చే ఎన్నికలలో జనసేన సొంతంగా పోటీ చేస్తే బాగా ప్రభావం చూపించే సీట్లు ఏపీ వ్యాప్తంగా 40 వరకూ ఉండొచ్చని భోగట్టా. అవీ కూడా ఉభయ‌ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రాలోని కొన్ని,  కోస్తాలో మరికొన్ని ఉంటాయని టాక్. ఈ సీట్లపైనే పూర్తిగా కాన్సంట్రేషన్ ఉంచాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.


అసలు విషయం ఏంటి :


వచ్చే ఎన్నికలలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నువ్వా నేనా అన్న రేంజిలో ఫైట్ చేస్తారన్నది నిజం. వారితో పోల్చుకుంటే అంతటి సంస్థాగత నిర్మాణం, ద్వితీయ శ్రేణి నాయకత్వం, అంగ, అర్ధ బలాలు జనసేనకు లేవన్నది ఓ అంచనా. దాంతో మొత్తం సీట్లకు పోటీ పెట్టి భంగపడడం కంటే గెలుపు చాన్స్ బాగా ఉన్న చోట్ల గట్టిగా పనిచేసే మంచి ఫలితాలు ఉంటాయని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారట.


అలా చేస్తారా :


గెలిచే అవకాశం ఉన్న చోట బాగా పనిచేస్తూనే మిగిలిన చోట్ల  తమతో కలసి వచ్చే పార్టీలకు సపోర్ట్ గా నిలవాలని జనసేన ఓ ప్లాన్ వేసుకుందని అంటున్నారు. ఇప్పటికైతే అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలను ప్రధమ శత్రువులుగానే చూస్తున్న జనసేన ఎన్నికల ముందు తన స్ట్రాటజీ బయటపెడుతుందని అంటున్నారు. అప్పటి పరిస్థితులు, ఏ పార్టీ గాలి ఎలా ఉందో చూసుకుని ఓట్ల టాన్స్ ఫర్ చేయాలని ఆలోచనలో ఉందని టాక్ నడుస్తోంది.
ఏపేలో దాదాపు వందకు పైగా అసెంబ్లీ సీట్లలో జనసేనకు కచ్చితంగా మూడు నుంచి అయిదు వేల పైగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లుగా గుర్తించారు. అటువంటి చోట్ల  వ్యూహాలకు పదును పెడుతున్నారు.  మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: