టీడీపీ లో మోస్ట్ పవర్ ఫుల్ నాయకులూ ఎవరైనా ఉన్నారంటే మొదటగా మనకు గుర్తొచ్చేది జేసి బ్రదర్స్. ఏదైనా చెప్పాలనుకుంటే ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. చివరికి పార్టీ అధినేత చంద్ర బాబు గురించి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. ఎందుకంటే బాబు పార్టీ టిక్కెట్ ఇచ్చిన ఇవ్వక పోయిన తాము గెలుస్తామని వారి మీద వారికి నమ్మకం.  తాము పోటీ చేయమని మాత్రమేగాక.. తమ తనయులు పోటీ చేస్తారని కూడా వీళ్లే అనౌన్స్‌ చేసుకొంటూ ఉన్నారు.

Image result for jc brothers

తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ధైర్యం ఎవ్వరూ చేయడంలేదు. తమ తనయులను రంగంలోకి దించాలని అనుకుంటున్న వారు కూడా చాలా పద్ధతిగా చంద్రబాబుకు విన్నపాలు చేసుకుంటున్నారు. తాము త్యాగం చేస్తామని తమ వాళ్లకు అవకాశం ఇవ్వమని వీరు విన్నపాలు చేసుకుంటున్నారు. అయితే జేసీ సోదరులు మాత్రం.. చంద్రబాబుకు విన్నవించుకునేది ఏమిటి అన్నట్టుగా తామే అనౌన్స్‌మెంట్లు చేసుకొంటూ ఉన్నారు.

Image result for jc brothers

జేసీ పవన్‌ విషయంలో దివాకర్‌ రెడ్డి ఎలా ప్రకటించుకున్నాడో, జేసీ అస్మిత్‌ విషయంలో ప్రభాకర్‌ రెడ్డి అలాగనే ప్రకటించేసుకున్నాడు. ఈ విధంగా వీళ్లిద్దరి అనౌన్స్‌మెంట్లు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేయనక్కర్లేదా? అనే సందేహం ఎలాగూ ఉండనే ఉంది. అయితే చంద్రబాబు ప్రస్తావనే లేకుండా వీళ్లిద్దరూ అనౌన్స్‌మెంట్లు చేసుకున్నారు. ఇక ఆ సంగతలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో తను ఎమ్మెల్యేగా పోటీచేయనని ప్రకటించుకున్న ప్రభాకర్‌ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోనని అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: