జనసేన పార్టీ పెట్టి సీఎం అవుదామని కలలు కంటున్న పవన్ కళ్యాణ్ కే కాదు ఆయన ఫ్యాన్స్ కి కూడా బిగ్ షాక్ ఇచ్చారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. పవన్ ని ఓ హీరోగా  ఏ రోజూ ఎక్కడా  ఓటమి ఎరగని మేరు నగ ధీరుడిగా ఫ్యాన్స్ కొలుస్తూ ఉంటారు. అటువంటి పవన్ ఎన్నికల గోదాలోకి దిగనూ లేదు, పోటీ చేయనూ లేదు, అపుడే ఆయన ఓడిపోతారంటూ అపశకునం పలికేసారు నాని. జనసేన ఎక్కడా గెలవదు,  ఏకంగా  అధినేతే ఓడిపోతారంటూ హాట్ కామెంట్స్ చేశారు


స్తిరత్వం లేదుట :


పవన్ కల్యాణ్ కి స్తిరత్వం లేదుట. అంతే కాదు రాజకీయ పరిణతి కూడా లేదుట. ఆయన రాజకీయంగా కడు బలహీనమైన స్తాయిలో ఉన్నారట. ఈ రోజు ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఈ కామెంట్స్ చేశారు. ఈ రోజు  పవన్ కంటే కూడా నాటి ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి వంద రెట్లు బలవంతుడు అంటూ అన్నాదమ్ముల మధ్య పోలిక కూడా తెచ్చారు. అంతే కాదు చిరంజీవి వివాదరహితుడు, సున్నిత మనస్కుడు అంటూ ఓ రేంజిలో పొగిడేశారు.


ఆయనదే యూటర్న్ ట:


తాము ఎపుడూ పవన్ ని వదులుకోలేదని, మిత్రపక్షంగా చాలా రెస్పెక్ట్ ఇచ్చామని చెప్పుకొచ్చిన నాని కోరి పవన్ బయటకు వెళ్ళారని ఘాటుగా విమర్శించారు. ఆయన యూ టర్న్ తీసుకున్నారంటూ సెటైర్లు వేశారు. ఇపుడు చంద్రబాబుని, లోకేశ్ ని ప్రతీ రోజు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా ఉండడం చూస్తూటే పవన్ ఆ పార్టీతో కుమ్మక్కు అయ్యారా అని ప్రశ్నించారు.  వచ్చే ఎన్నికలలో పవన్ కి ఓట్లూ, సీట్లూ రెండూ రావని జోస్యం చెప్పిన నాని జనసేనానితో పాటు, అభిమాన గణం కలలనూ తన కామెంట్స్ తో గండి కొట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: