ఆంధ్ర ప్రదేశ్ లో లెఫ్ట్ పార్టీ లు అయినా సీపీఐ సీపీఎం లు కు ఓటు బ్యాంకు ఎంత ఉందో మనకందరికీ తెలిసిందే. అయితే వీరు ఈ మధ్య కామెడీ లు కూడా బాగా చేస్తున్నారు . ముక్కోణపు పోరు జరగబోతుందని సీఎం సీఎం పదవుల గురించి కూడా వీరు మాట్లాడతున్నారు ఇంత కంటే కామెడీ ఇంకేమి కావాలి బహుశా వారి దైర్యం పవన్ కళ్యాణ్ ను చూసుకొని అనుకుంటా...  ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడైనా డిపాజిట్ సాధించగలిగే నియోజకవర్గం ఏదైనా ఉందా? ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అంటున్న రామకృష్ణ ఎక్కడ పోటీచేసి నెగ్గబోతున్నాడు?

Image result for cpi and cpm

ముక్కోణపు పోటీ అంటున్న మధు ఏ నియోజకవర్గంలో అయినా నామినేషన్ వేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు కానీ.. ఎర్రన్నల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. వీళ్ల ఆశలన్నీ పవన్ కల్యాణ్ మీదే ఉన్నాయి పాపం. పవన్ కల్యాణ్‌తో తాము కలిసి పోటీ చేయబోతున్నామని.. మూడో కూటమి తమదేనని.. తాము టీడీపీ, వైఎస్సార్సీపీలకు పోటీ ఇచ్చేస్తామని.. వీళ్లు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి? అనే ప్రాథమిక విషయాన్ని మరిచి మాట్లాడుతున్న కమ్యూనిస్టులను ఎలా సీరియస్ గా తీసుకునేది? 

Image result for cpi and cpm

చిరంజీవి పార్టీ పెట్టి.. తీవ్రంగా చమటోడ్చి 18 సీట్లు సాధించాడు.. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ పార్టీ మీద ఎలా భారీ అంచనాలను పెట్టుకుంటారు? ఆల్రెడీ చిరంజీవి చేసిన విలీనంతో జనసామాన్యం వీళ్ల మీద ఒక అంచనాలకు వచ్చేసింది. ఇంకా అద్భుతాలు జరగుతాయని అనాలా? ముక్కోణపు పోటీ అనేముందు.. ఈ మూడు పార్టీలకూ ఎన్ని నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరుకుతారు? ఎన్నిచోట్ల వీళ్ల తరఫున కనీసం డిపాజిట్లు రాబట్టగల వాళ్లు నామినేషన్లు వేస్తారు? అనే విషయాల గురించి వివరణలు ఇచ్చుకుంటే.. ఆ తర్వాత మరేమైనా మాట్లాడవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: