కేరళలో గడచిన వందేళ్ళలో కనీ వినీ ఎరగని పెను విపత్తు సంభవించింది. దాదాపు లక్ష హెక్టార్ల మేర పంట పోయింది. వందలాది మంది ముత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్ష కోట్ల రూపాయల మేర భారీగా నష్టం వాటిల్లింది. మొత్తం పద్నాలుగు జిల్లాలూ అతలాకుతలం అయ్యాయి. ఓ విధంగా చెప్పాలంటే దేవ భూమి మరు భూమి గా మారిపోయింది. ఇది ప్రక్రుతి ధర్మాగ్రహం. మరి తప్పు చేసిందెవరు..


వార్నింగ్స్ పట్టించుకోనందునే :



కేరళలో ఇటువంటి పెను ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఏడేళ్ళ క్రితమే హెచ్చరించారు. ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ దీనిపై ఓ నివేదిక 2011 ఆగస్ట్ 31న నాటి కేరళ ప్రభుత్వానికీ, కేంద్రానికి సమర్పించారు. అందులో పశ్చిమ కనుమలలో సుమారు లక్షా 40 వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ప్రాంతాన్ని ఈఎస్జెడ్ గా ప్రకటించాలని, దీనిని మూడు జోన్లుగా విభజించాలని సూచించారు.



అలాగే ఆ ప్రాంతాలలో గనుల తవ్వకాలను, క్వారీలను నిషేధించాల‌ని, ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలు చెపట్టరాదని స్పష్టంగా చెప్పారు. అడవుల నరికివేతను అరికట్టాలని అరికట్టాలని కూడా పేర్కొన్నారు.  ఆ నివేదికను బుట్టదాకలు చేయడం వల్లనే ఈ పరిస్థితి. ఇపుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.  కానీ ప్రయోజనం ఏముంది. కేరళ ప్రళయం దెబ్బకు విలవిలాడుతోంది. అందాల కేరళ విషాదంగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: