అదేంటో కానీ మిగతా పార్టీలో ఉన్నపుడు క్రమశిక్షణ బాగానే పాటిస్తారు. అదే వైసీపీలోకి రాగానే ప్లేట్ ఫిరాయిస్తారు. మరి అధినేతను చూసి అలుసో లేక ఇక్కడ తమ కంటే ఎవరూ లేరనో మొత్తానికి ఈ తరహా నాయకులు ఇపుడు వైసీపీలో ఎక్కువైపోయారు. ఏరీ కోరీ తెచ్చుకున్న పాపానికి వారిని భరించాల్సివస్తోంది. ఇదీ విశాఖ జిల్లాలో క్యాడర్ చెబుతున్న మాట.


బట్టబయలైన విభేదాలు :



వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎలమంచిలి నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు కీచులాడుకుంటున్నారు. ఇవాళో రేపో జగన్ పాదయాత్ర ఎలమంచిలిలోకి ప్రవేశిస్తోంది. అంతా ఐక్యంగా ఉండాల్సిన చోట రచ్చ రాజుకుంది. పార్టీలో కొత్తగా చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కు, అంతకు ముందే అక్కడ ఉన్న పాత నాయకులకూ అసలు పొసగడంలేదు. దాంతో పార్టీ పెద్ద విజయసాయిరెడ్డి ముందే వారు వాదులాడుకున్నారు. గుట్టు రట్టు చేసుకున్నారు.


నా రూట్ సెపరేట్ :


ఎలమంచిలి టికెట్ పోరు ఇపుడు క్లైమాక్స్ కి చేరుకుంది. కన్నబాబురాజుకు టికెట్ కంఫర్మ్ చేస్తే పాత నాయకులు ఊరుకునేలా లేరు. అలాగని ఇప్పటికిపుడు పార్టీని వదలరు. చేయాల్సిన అల్లరంతా చేసేసి బయటకు పోయెలా ఉన్నారు. ఇక రాజు గారు నా రూట్ సెపరేట్ అంటున్నారు. పాత నాయకులతో ఆయన సర్దుబాటుకు కనీసంగా ట్రై చేయడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. మొత్తానికి ఎలమంచిలి ఇపుడు వైసీపీకి తలకాయ నొప్పిలా తయారైంది. జగన్ వస్తే ఎలా సర్దిచెబుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: