ఏపిఎన్జీవో అధ్య‌క్షుడు అశోక్ బాబుకు ఉద్యోగులు చుక్కులు చూపిస్తున్నారు.  త‌క్ష‌ణ‌మే ఉద్యోగ సంఘం అధ్య‌క్ష‌ బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకోవాలంటూ అల్టిమేటమ్ ఇవ్వ‌టం ఉద్యోగుల్లో  ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.  గ‌తంలో ఎన్నో ప్ర‌భుత్వాలు వ‌చ్చాయి, వెళ్ళాయి. ఉద్యోగ సంఘాల నేత‌లు కూడా ఎంతో మంది ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ వారెవ‌రూ ఈ స్ధాయిలో పార్టీ ముద్ర వేయించుకోలేదు. ఇపుడు అశోక్ బాబు పై టిడిపికి అనుకూలుడ‌ని ముద్ర‌ప‌డ‌టంతోనే ఉద్యోగులు మండిపోతున్నారు. అశోక్ కూడా త‌నపై ముద్ర‌ప‌డినందుకు ఏమీ బాధ‌ప‌డుతున్న‌ట్లు లేదు.


అశోక్ కు ను దిగిపొమ్మ‌న్న నేత‌లు


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  ఈ మ‌ధ్యే విజ‌య‌వాడ‌లో ఎన్జీవో భ‌వ‌న్లో వివిధ సంఘాల నేత‌ల అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌రిగింది. ఆ సమావేశానికి అశోక్ కూడా హాజ‌ర‌య్యారు. అస‌లు అశోక్ బాబు విష‌యం తేల్చేందుకే స‌మావేశం జ‌రిగింది. స‌మావేశం మొద‌ల‌వ్వ‌గానే అధ్య‌క్షునిపై  త‌మ అభిప్రాయాల‌తో కూడిన ఒక లేఖ‌ను సంత‌కాల‌తో స‌హా త‌యారుచేసి స్వ‌యంగా అశోక్ కే అందించారు.  ఆ లేఖ‌ను సాంతం చ‌ద‌విని త‌ర్వాత అశోక్ కు త‌న ప‌రిస్ధితేంటో బాగా అర్ధ‌మైపోయింద‌ట‌.  లేఖ చ‌దివిన త‌ర్వాత అశోక్ మాట్లాడుతూ, అధ్య‌క్షునిగా త‌న‌ను ఎప్పుడు దిగిపొమ్మంటారంటూ మిగిలిన వారిని అడిగార‌ట‌. దాంతో మిగిలిన నేత‌లు కూడా మాట్లాడుతూ ఎంత తొంద‌ర‌గా వెళ్ళిపోతే అంత మంచిదంటూ స్ప‌ష్టంగానే  బ‌దులిచ్చార‌ట‌.  దాంతో  చేసేది లేక అశోక్ త‌లొంచుకుని కూర్చున్నార‌ట‌.


 రాజ‌కీయ ముద్ర‌పై  అభ్యంత‌రాలు

Related image

త‌ర్వాత ఉద్యోగ సంఘం నేత‌లు మాట్లాడుతూ,  టిడిపి ముద్ర వేయించుకున్న వ్య‌క్తి ఏపి ఎన్జీవో అధ్య‌క్షునిగా త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని కొంద‌రు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పార‌ట‌. లేక‌పోతే త‌న‌కు ఏ రాజ‌కీయ పార్టీతోనే సంబంధాలు లేవ‌ని మీడియా ముందు స్ప‌ష్టంగా ప్ర‌క‌టించాల‌నే ష‌ర‌తు విధించార‌ట‌.  అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు మాట్లాడుతూ, త‌మ అసోసియేష‌న్ పై రాజ‌కీయ ముద్ర ప‌డ‌టం త‌మ‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని తేల్చిచెప్పారు. ఎటూ అశోక్ కు టిడిపి ముద్ర ప‌డింది కాబ‌ట్టి ఇక ఏపి ఎన్జీవో అధ్య‌క్షునిగా ఎంత తొంద‌ర‌గా దిగిపోతే అంత‌మంచిదంటూ గ‌ట్టిగానే చెప్పార‌ట‌. 


త‌ర్వాత చంద్ర‌బాబు ఆద‌రిస్తారా ?


స‌మావేశం చివ‌ర‌లో అశోక్ మాట్లాడుతూ  త‌న త‌ర్వాత  ఏపి ఎన్జీవో అధ్యక్షునిగా  కృష్ణా జిల్లాకు చెందిన విద్యాసాగ‌ర్ ను అశోక్ ప్ర‌తిపాదించారు. అయితే అందుకు 12 యూనియ‌న్ల‌కు చెందిన అధ్య‌క్షులు పూర్తిగా వ్య‌తిరేకించారు. అశోక్ చెప్పిన వ్య‌క్తే అధ్య‌క్షుడైతే అప్పుడు పెద్ద తేడా ఏమీ ఉండ‌దంటూ  అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం  చేశార‌ట‌. దాంతో ఏమీ చేయాలో తేల్చుకోలేక స‌మావేశం నుండి అశోక్ బ‌య‌ట‌కు వెళ్ళిపోయార‌ట‌. మొత్తం మీద  చూస్తుంటే అశోక్ టిడిపిలో  చేర‌టం ఖాయంగానే ఉంది. కాక‌పోతే ఒక‌సారి ఏపి ఎన్జీవో బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకున్న తర్వాత అశోక్ ను చంద్ర‌బాబు ఇప్ప‌టిలా ఆద‌రిస్తారా ? అన్న‌దే చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: