డోన్ శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి "రాజధాని ప్రాంత అభివృద్ది మండలి (సిఆర్డిఏ)" ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  10.75%వడ్డీపై అమరావతి అభివృద్ది కోసం బాండ్లు  విడుదల చేయగా బోంబే స్టాక్ ఎక్చేంజ్ లో 1.5 టైంస్ ఓవర్ సబ్స్క్రైబ్ అదీ రెండు గంటల్లోనే అయిన బాగోతాన్ని బట్టబయలు చేశారు.


ఈ రోజు మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి స్వతంత్ర దినోత్సవ సంరంభం కూడా పక్కనపెట్టి ఏపీ బాండ్లు అంటూ ప్రజలను ఊరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ధారుణంగా మోసం చేస్తోందని అన్నారు. ₹1300 కోట్లకు ప్రయత్నించగా ఒక గంటలో ₹2000 కోట్లకు అమ్ముడై అమ్ముడైనవని సిఆర్డిఏ కమీషనర్ సిహెచ్ శ్రీధర్ తన్మయులై చెప్పారు.  అమరావతి బాండ్లు అంటే అదేదో ఉట్టిగనే, పుక్కటిగా వచ్చిన డబ్బులాగా ఏపి ప్రభుత్వం ప్రచారం చేస్తోందని బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి పెదవి విరిచారు.
amaavati bonds crda ch sridhar కోసం చిత్ర ఫలితం
ఎక్కడా లేని విదంగా ఏ బాంకూ కనీసం కోపరేటివ్ బాంక్ కూడా 8 శాతం మించి వడ్డీ ఇచ్చే పరిస్థితులు లేని సమయంలో, ఒక రాష్ట్రప్రభుత్వం 10.75 శాతం వడ్డీకి బాండ్లను విడుదల చేసి బాండ్ల పేరున ధారుణంగా అప్పులు చేశారని, ఇందులో పెట్టుబడి పెట్టినవారిలో తొమ్మిది మంది పెట్టుబడిదారులు ఉన్నారని, వారి పేర్లు ప్రభుత్వం వెల్లడించాలని బుగ్గన డిమాండ్ చేశారు.


దేశంలో ఎన్నో బాండ్లు వచ్చాయని, కాని ఇలా 10.75శాతం వడ్డీ ఇచ్చే బాండ్లు అమరావతి బాండ్లేనని దీనితో రాష్ట్ర ఆర్ధికస్థితి మరింత దిగజారనుందని అన్నారు. మొదట ఆరు శాతం వడ్డీకి మించి బాండ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం జీఓ ఇచ్చిందని అయితే దానిని మార్చి ఇప్పుడు ఏకంగా 10.75 శాతం వడ్డీ ఇవ్వటానికి నిర్ణయం ఎలా తీసుకున్నారని బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రశ్నించారు.
amaavati bonds crda ch sridhar కోసం చిత్ర ఫలితం
ఇంద్రజాలం కంటే మన చంద్రజాలం అద్భుతం. మాయలు కపటాలు చేసి తిమ్మిని బమ్మిని చేయటంలో ఆంధ్రప్రదేశ్ అధినేత చంద్రబాబును మించినవారు ఉండ రనే అభిప్రాయాన్ని బుగ్గన రాజెంద్రనాథ్ రెడ్ది తెలిపారు.   


అధికార తెలుగు దేశం మోసం చేస్తుంటే, ఓ వర్గం మీడియా బాద్యతారాహిత్యంతో ప్రభుత్వానికి అనుకూల ప్రచారం చేయడం అన్యాయం అంటూ బుగ్గన పేర్కొన్నారు. రాజదాని అమరావతి, రాష్ట్ర అప్పులు పెరిగిన చందం పై కూడా బుగ్గన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: