కేరళ లో వరదల నేపధ్యం లో అందరు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా స్టార్స్ నుంచి రాజకీయ నాయకులూ పలువురు విరాళాన్ని ప్రకటించాడు అయితే ఇప్పడూ టీడీపీ నేత మాజీ కేంద్ర మంత్రి  సుజనా చౌదరి కేరళ విరాళం వివాదాస్పదం అవుతుంది. ఈయన ఇరవై లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు . ఇక్కడ వరకూ అభినందనీయమే. అయితే ఈ ఇరవై లక్షల రూపాయల మొత్తాన్ని తన వ్యక్తిగత ఖాతా నుంచి ఇవ్వడంలేదు ఈయన.

Image result for sujana chowdary

ఎంపీ హోదాలో ఈయన తన ఖాతాలోని నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయల మొత్తాన్ని కేరళకు విరాళంగా ప్రకటించాడు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా.. ఎంపీ లాడ్స్ నుంచి ఈయన విరాళాన్ని ప్రకటించడం విడ్డూరమైన అంశం. అంతగా సాయం చేయాలనుకుంటే వ్యక్తిగతంగా ఇవ్వాలి. అంతేకానీ.. ఇలా ప్రభుత్వ ఖాతా నుంచి నిధులు తీసి.. దాన్ని విరాళం అని ప్రకటించుకోవడం విడ్డూరం.

Image result for sujana chowdary

రాష్ట్రాల వారీగా నిధులను ఇస్తున్నారు.. అంతవరకూ ఓకే. అంతే కానీ.. ఇలా ఎంపీగా తన ఖాతాలో ఉండే నిధుల నుంచి విరాళం ఇవ్వడం చాలా కక్కుర్తి అనిపించుకుంటుంది. ఇదివరకూ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండిన ఒకవ్యక్తి తన వ్యక్తిగత సొమ్మును కాకుండా... ఇలాగే ప్రభుత్వ ఖాతా నుంచి నిధులను విరాళంగా ప్రకటించాడు. వైజాగ్ తుఫాన్‌ బారిన పడ్డప్పుడు ఆ నేత ఆ పని చేశాడు. తీవ్ర విమర్శల పాలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: