పవన్ ప్రచారం కోసం అదిరి పోయే వాహనం సిద్ధం అయ్యింది. ఇన్ని రోజులు కారులో పర్యటించి రాత్రుళ్ళు ఎక్కడ పడితే అక్కడ బస చేసేవాడు. ఇప్పడూ మాత్రం తన కోసం సకల సౌకర్యాలతో బస్సు సిద్ధం అయిపొయింది. పవన్ పై అభిమానంతో అతడి మిత్రుడు, టీవీ99 ఓనర్ తోట చంద్రశేఖర్ ఈ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో జనసేనానికి ఇది అందుబాటులోకి వస్తుంది.

Image result for pawan kalyan bus

కారవాన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రముఖులతో సమావేశాలు జరుపుకోవచ్చు. కావాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. టీవీ, ఇంటర్నెట్ లాంటి సకల సౌకర్యాలు ఈ ప్రచార రధంలో ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయ నాయకుల్లో అత్యంత ఖరీదైన ఇలాంటి వాహనం చంద్రబాబు దగ్గర ఉంది. ఆ వాహనం తర్వాత సకల హంగులు సంతరించుకున్న ఇసుజు కంపెనీకి చెందిన ఫుల్లీ-లోడెడ్ వాహనం ఇదే.

Image result for pawan kalyan bus

వైఎస్ఆర్సీ అధినేత జగన్ వద్ద కూడా ఇలాంటి ఓ వాహనం ఉన్నప్పటికీ, అది కాస్త పాతది. జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు చాటిచెప్పేలా ఈ బస్సుపై పోస్టర్లు అతికించారు. ఇకపై తన పర్యటనల్లో ఈ బస్సుపై నుంచే పవన్ ప్రసంగిస్తారు. రాబోయే ఎన్నికల కోసం లోకేష్ కూడా ఓ కాస్ట్ లీ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ కోసం ఇప్పుడు రెడీ అవుతున్న బస్సును తలదన్నేలా అది రూపుదిద్దుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: