చంద్ర‌బాబునాయుడు కాంగ్రెస్ తో క‌లుస్తున్నారంటూ చాలా మంది గ‌గ్గోలు పెడుతున్నారు.  కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌తోనే పురుడు పోసుకున్న తెలుగుదేశంపార్టీ ఇపుడు అదే కాంగ్రెస్ నేత‌ల‌తో  క‌లిసి ఎలా తిరుగుతున్నారు ?  భ‌విష్య‌త్ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ తో పొత్తు ఎలా పెట్టుకుంటుంది ?  అంటూ ఒక‌టే గోల చేస్తున్న‌రు. నిజానికి అలా అంటున్న వారంతా ఒక విష‌యం  మ‌ర‌చిపోతున్నారు.  ఇపుడున్న తెలుగుదేశంపార్టీ అప్ప‌ట్లో ఎన్టీఆర్ పెట్టింది కాదు. 


ఎన్టీఆర్ సిద్ధాంతాలు 

Related image

ఎప్పుడైతే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్ర‌బాబు సిఎం కుర్చీతో పాటు పార్టీని కూడా లాగేసుకున్నారో అప్ప‌టి నుండే పార్టీ సిద్ధాంతాలు మారిపోయాయి.  టిడిపిని స్ధాపించిన ఎన్టీఆర్ కు మూడు సిద్ధాంతాలుండేవి.  ఒక‌టి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకోవ‌టం. రెండోది  కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌. మూడోది ప్ర‌జా సంక్షేమం.  ముఖ్య‌మంత్రిగా ఉన్నంత వ‌ర‌కూ మూడు సిద్ధాంతాల‌కు ఎన్టీఆర్ క‌ట్టుబ‌డే ఉన్నారు. సిఎం కుర్చీని  పోగొట్టుకున్నా చివ‌రిరోజు వ‌ర‌కూ మొద‌టి సిద్ధాంతాన్ని మాత్రం వ‌ద‌ల‌లేదు. 


చంద్ర‌బాబు సిద్ధాంతాలు

Image result for chandrababu naidu

చంద్ర‌బాబుకు కూడా కొన్ని సిద్ధాంతాలున్నాయి.  మొద‌టిది ప‌ద‌విని అందుకోవ‌టం. రెండోది ఆ ప‌ద‌వి కోసం ఎవ‌రితో అయినా క‌ల‌వ‌టం. మూడోది  ప‌ద‌విని కాపాడుకోవ‌టానికి ఎంత స్ధాయికైనా దిగ‌జారటం. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం మొత్తాన్ని గ‌మ‌నిస్తే పై మూడు అంశాలు మాత్ర‌మే క‌న‌బ‌డ‌తాయి. ఆత్మ‌గౌర‌వం విలువ‌లు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం లాంటి మాట‌ల‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర చోటుండ‌దు. అవ‌స‌రానికి నేత‌ల‌ను వాడుకోవ‌టం అవ‌స‌రం తీరిపోగానే వాళ్ళ‌ని వ‌దిలించుకోవ‌టం ఇవే చంద్ర‌బాబు సిద్దాంతం.


ఒంటిరి పోటీకి  ధైర్యం లేదు

Image result for tdp logo

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌టానికి చంద్ర‌బాబుకు ధైర్యం స‌రిపోవ‌టం లేదు. అలాగ‌ని చంద్ర‌బాబుతో పొత్తులు పెట్టుకోవ‌టానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు.  అందుకే  కాంగ్రెస్ పార్టీతో  పొత్తుకు సిద్ధ‌ప‌డుతున్నారు.  పైగా ఇపుడున్న టిడిపి పూర్తిగా చంద్ర‌బాబు టిడిపి అన్న విష‌యాన్ని జ‌నాలు మ‌ర‌చిపోతున్నారు.  ఎప్పుడైతే టిడిపి ఎన్టీఆర్ చేతుల్లో నుండి చంద్ర‌బాబు చేతిలోకి వ‌చ్చేసిందో అప్ప‌టి నుండే చంద్ర‌బాబు  సిద్ధాంతాలు అమ‌ల‌వ్వ‌టం మొద‌లైంది. అందులోనూ క‌ష్టాల్లో  ఉన్న చంద్ర‌బాబు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధ‌ప‌డ‌టంలో ఆశ్చ‌ర్య‌మేలేదు. స‌రే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏమ‌వుతుంది ?  ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటే ఏమ‌వుతుందన్న‌ది వేరే సంగ‌తి. చంద్ర‌బాబు ఏదో వ్యూహం ప్ర‌కార‌మే ముందుకెళ‌తారు. అది వ‌ర్క‌వుట‌వుతుందా లేదా అన్న‌ది భ‌విష్య‌త్తులో తేలుతుంది.


క‌న్న బిడ్డ‌ల‌కే ప్రేమ లేదు


అయినా క‌డుపున పుట్టిన బిడ్డ‌ల‌కే ఎన్టీఆర్ పై ప్రేమ‌లేదు సిద్ధాంతాల‌పై న‌మ్మ‌కం లేదు. అటువంటిది ఎన్టీఆర్ కు అల్లుడ‌యినంత మాత్రాన చంద్ర‌బాబుకు ఎలాగుంటుంది ఎన్టీఆర్ ను ప‌ద‌విలో నుండి దింపేయ‌టంలో పిల్ల‌ల్లో ఎవ‌రి ప్ర‌మేయ‌మెంతో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఎన్టీఆర్ పిల్ల‌ల స‌హ‌కారం లేకుండా చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచే చాన్సే లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.  అలాంటిది చంద్ర‌బాబు ముందు సిద్ధాంతాల గురించి మాట్లాడితే ఉప‌యోగ‌ముంటుందా  బ‌ట్టి అధికారం వ‌స్తుందంటే కాంగ్రెస్ అనే  కాదు ఏ పార్టీతో అయినా  చంద్రబాబు పొత్తుకు సిద్ధ‌మే. ఎవ‌రికైనా ఎనీ డౌట్  ?



మరింత సమాచారం తెలుసుకోండి: