నేను రెండాకులు చదివానంటే నేను నాలుగాకులు ఎక్కువ చదివానంటూ తెల్లారి లేస్తే తమ గొప్పలు చెప్పుకునే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అసలు గుట్టు ఏంటన్నది ఆ సర్వే బట్టబయలు చేసింది. ఇద్దరి గురించి అద్దం పట్టి మరీ చెప్పేసింది. వారి స్థానాలు ఎక్కడో కూడా ఎంచక్కా వివరించేసింది. ఆ సర్వేతో ఇద్దరు చంద్రులకు గట్టి షాక్ తగిలినట్లైంది.


దీదీయే నంబర్ వన్ :


లేటేస్ట్ గా  ఇండియా టు డే ఓటర్ల నాడిపై చేసిన ఓ సర్వే ఇపుడు దేశవ్యాప్తంగా ఇంటెరెస్టింగ్ గా మారింది. దేశంలో ఎవరు ఉత్తమ ముఖ్యమంత్రి అన్న దానిపై చేసిన ఆ సర్వేలో ఫస్ట్ ప్లేస్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దక్కించుంది. ఆమె 13 శాతం  ఓట్లతో చాలా ముందు వరసలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నారు. ఆయనకు పది శాతం ఓట్లు వచ్చాయి. ఇక మూడవ స్థానం యూపీ సీఎం యోగి తొమ్మిది శాతం ఓట్లతో సాధించారు.


బాగా వెనకబడ్డ బాబు :


ఇక దేశంలోకెల్లా  సీనియర్ని అంటూ ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఈ సర్వేలో కేవలం ఏడు శాతం ఓట్లను సాధించి బాగా వెనకబడ్డారు. అంటే మొదటి ప్లేస్ లో ఉన్న మమతకు వచ్చిన ఓట్లలో సగం అన్న మాట బాబుకు దక్కింది. ఇక ఆయన కంటే కూడా తెలంగాణా సీఎం కేసీయార్  వెనకబడి ఉన్నారు ఆయనకు కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 


ఆమెతోనే సాధ్యమా :


ఈ సర్వేను బట్టి చూస్తే దేశంలో టాప్ సీఎం గా మమత ఉన్నారు. ఆమె పనితనమే కాదు, ప్రధాని మోడీని డీ కొట్టే విషయంలోనొ మంచి మార్కులు వచ్చాయి. అంటే రేపటి రోజున  కేంద్రంలో ప్రత్యామ్యాయ  రాజకీయం నడపాలంటే మమతకే సాధ్యమన్నది సర్వే స్పష్టం చేస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ తో కేసీయర్, కూటమి అంటూ బాబు చేస్తున్న హడావుడి కి ఓ విధంగా ఈ సర్వే చెక్ పెట్టేసింది. అదీ మ్యాటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: