కాంగ్రెస్ పార్టీకి 2014లో జనాలు డిపాజిట్లు సైతం గల్లంతు చేసేసరికి మైండ్ బ్లాంక్ అయిందేమో. ఇప్పటికీ వారికి రాజకీయంగా ఏంచేయాలో అర్ధం కాని పరిస్థితిలా ఉంది. ఆ అయోమయంలోనే పుణ్యకాలమంతా గడచిపోయింది. విషయనికి వస్తే రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాటి ప్రతిపక్షంపై పోరాటం అంటున్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఈ వింత మరెక్కడా ఉండదేమో..


దీన్ని పోరాటం అంటారా :


2014 ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి వచ్చిందేవరు, కేంద్రంలో బీజెపీతో పొత్తు పెట్టుకుని హామీలు కుమ్మరించిందెవరు. నాలుగేళ్ళుగా ప్రజల సమస్యలు తీరకపోవడానికి కారకులేవరు, ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరకపోవడానికి ఎవరు బాధ్యులు. రాజకీయాలలో దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన రఘువీరారెడ్డికి ఇవన్నీ తెలియదు అనుకోగలమా. మరి తెలిసి ఆయన ఎందుకిలా అంటున్నారో. తమ పోరాటం వైసీపీ మీదనే  అంటూ ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు రఘువీరారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు.


పొత్తు పొడుపేనా :


రఘువీరా మాటలు చూస్తూంటే టీడీపీతో పొత్తులు పొడిచాయనిపిస్తోంది. అందుకే ఆయన పోరాడాల్సిన టీడీపీని వదిలేసి వైసీపీ మీదకు గురి పెడుతున్నారు. నాలుగున్నరేళ్ళుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు చాలా మంచి వారు అయ్యారు కాబోలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఏపీ మ్యాప్ అచ్చం ఇటలీ దేశం మ్యాప్ ని గుర్తుకు తెస్తుంది, సోనియా పుట్టిన రోజున కేక్ కోసినట్లుగా ఏపీని రెండు ముక్కలు చేశారంటూ నిన్నటి వరకూ చంద్రబాబు చేసిన ఘాటు విమర్శలు రఘువీరా మరచిపోయారేమో కానీ జనాలకు అన్నీ గుర్తు వున్నాయిగా.

పాతాళం వరకు గోయి తీసి కాంగ్రెస్ ని పాతిపెట్టాలని, అసలు క్షమించరాదని ఇదే తెలుగుదేశం నాయకులు అన్న మాటల‌న్ని మరచిన కాంగ్రెస్ కు ఏపీలో ఉనికి కావాలిపుడు. కానీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఓట్లు పడవు రఘువీరా. ఆ సంగతి మరచిపొతే ఎలా అంటున్నారు జనాలు


మరింత సమాచారం తెలుసుకోండి: