తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి ఆయన మెగాస్టార్. వెండి తెరపై నాలుగు దశాబ్దాల సినీ జీవితాన్ని పండించుకున్న సిసలైన కధానాయకుడు. అన్ని వయసుల వారూ నచ్చే మెచ్చే ఉత్తమ నటుడు. అశేష అభిమాన జనానికి అన్నయ్య. కేవలం సినిమాలలోనే కాదు. జీవితంలోనూ అత్యుత్తమ కుటుంబ విలువలను పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయుడైన మహానుభావుడు. అతడే మన చిరంజీవి. ఆయన పుట్టిన రోజు ఆగస్ట్ 22. ఆ రోజున అయన ఏం తన సినిమాలతో పాటు రాజకీయలపైనా ఏం చెబుతారోనని అంతా ఎదురుచూస్తున్నారు.


ఆ రంగంలోనూ:


ఇక రాజకీయాలలోనూ చిరంజీవి పాత్రను కొట్టి పారేయలేనిది. 2009 ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ నాటి మేరు నగ ధీరులు లాంటి రాజకీయ పార్టీలూ, నాయకులూ ఉగ్గబట్టుకుని ఉన్నారంటే చిరంజీవి పొలిటికల్ స్పీడ్ ఎలాంటిదో అర్ధమవుతుంది. :వచ్చేది ఎన్నికల ఏడాది. అన్ని పార్టీలూ అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుని పెట్టుకున్నాయి. అఫీషియల్ గా చూసుకుంటే చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడే. ఆ పార్టీ ఇటు ఏపీ, అటు తెలంగాణాలో గట్టిగా పోరాడాలనుకుంటోంది. మరి మాస్ లో ఇంకా చెక్కుచెదరని ఇమేజ్ ని అలా కాపాడుకుంటూ వస్తున్న చిరంజీవి వంటి నాయకున్ని ఆ పార్టీ అలా చూస్తూ వదిలేస్తుందా.మరో వైపు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి జనంలోకి వచ్చారు. అన్నగారి సాయం ఆయన కూడా కోరకుండా ఉంటారా.


ఆ వైపే అందరి చూపు :


 ఇంకోవైపు చిరంజీవిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ, వైసీపీ ఎప్పటినుంచో చూస్తున్నాయి. ఈ మధ్యనే వైసీపీకి చెందిన సాక్షి మీడియా అవార్డ్ ను స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చింది.  చిరంజీవి కూడా ఆనందంగా ఆ అవార్డ్ ని స్వీకరిస్తూ జగన్ సతీమణి, సాక్షి గ్రూప్ చైర్ పర్సన్ భారతి రెడ్డిని తన సోదరి అంటూ సంభోధించారు. చిరంజీవి ఇంటర్వ్యూలు కూడా సాక్షిలో వస్తున్నాయి. ఓ విధంగా మంచి రిలేషన్స్ ఉన్నాయనిపిస్తోంది. ఇది కేవలం సినిమాల వరకేనా, రాజకీయం వైపు కూడా టర్న్ తీసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


 ఏది ఏమైనా చిరంజీవి పెదవి విప్పాలని. పుట్టిన రోజున అసలు విషయం చెప్పాలని అభిమానులతో సహా అంతా కోరుకుంటున్నారు. తాను ఇక సినిమాలకే అన్న మాట క్లారిటీగా మెగాస్టార్ చెప్పేస్తే ఇకపై అ వూసే ఉండదు. లేక ఇలాగే సస్పెన్స్ కొనసాగిస్తే మాత్రం ఆయనతో పాటే పొలిటికల్ హీట్ అలా ఉంటూనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: