భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో రాదో తెలియదు కానీ కనీసం టెండర్ల దశ కూడా వ్యవహారం దాటడం లేదు. తాజాగా మరో మారు ఈటెండర్లు దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిర్ ఇండియాను పక్కన పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులకు భోఅగాపురం నిర్మాణం పనులు అప్పగించడం వెనక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలను బీజేపీ  చేస్తోంది. దీనిపై నిగ్గు   తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని కోరుతోంది.


కేంద్ర మంత్రికి ఫిర్యాదు :



 భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆ పార్టీ నాయకుడు సోము వీర్రాజు ఘాటు విమర్శలు చేశారు ఈ రోజు డిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు పనులు అప్పగించకుండా టెండర్‌ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన ప్రైవేట్‌ సంస్థల కోసం ఇతరులు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు


భూములు కొల్లగొట్టేందుకే : 


పెద్ద ఎత్తున అవినీతి చేసేందుకే టెండర్ల రూల్స్ ని బాబు ప్రభుత్వం మార్చేసిందని సోము అంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే  ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 


 ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎయిర్‌పోర్ట్‌ వ్యయాన్ని 2వేల కోట్ల నుంచి 4వేల కోట్ల రూపాయల వరకూ  చంద్రబాబు పెంచారని సోము అన్నారు.  ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు. మొత్తానికి భోగాపురం కధ కంచికి చేర్చేందుకు కమలనాధులు గట్టిగానే పని చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: