Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 4:06 am IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్ తో పొత్తుకు టిడిపి రెడీ..బ‌హిరంగ ప్ర‌క‌ట‌నే మిగిలింది

ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్ తో పొత్తుకు టిడిపి రెడీ..బ‌హిరంగ ప్ర‌క‌ట‌నే మిగిలింది
ఎడిటోరియ‌ల్ : కాంగ్రెస్ తో పొత్తుకు టిడిపి రెడీ..బ‌హిరంగ ప్ర‌క‌ట‌నే మిగిలింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్ర‌బాబునాయుడుకు ఒక అల‌వాటుంది. అదేమిటంటే త‌న మ‌న‌సులోని మాట‌ను ఇత‌రుల ద్వారా ముందు లీకుల రూపంలో ఇప్పిస్తారు. విష‌యం ఏదైనా కానీండి ముందుగా త‌న నోటి నుండి ఏదీ బ‌య‌ట‌కు రానీయ‌రు.  ఏదో ఒక స‌మావేశం పెట్ట‌డం అందులో పాల్గొన్న వారి ద్వారానే ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు, తాను జాగ్ర‌త్త‌గా వింటున్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తారు. చివ‌ర‌కు ఆ అంశంపై చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకోమంటూ నేత‌ల‌కే వ‌దిలేసిన‌ట్లు సీన్ క్రియేట్ చేస్తారు. అంటే  ఆలోచ‌న త‌న‌దే,  నిర్ణ‌య‌మూ త‌న‌దే. కానీ ఏది  కూడా త‌న నోటి నుండి వ‌చ్చిన‌ట్లుండ‌దు.  ఇదంతా ఎందుకంటే, రేపేదైనా తేడా వ‌స్తే త‌న‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌కుండా.


మంత్రుల ద్వారానే ప్ర‌తిపాద‌న‌లు

tdp-chandrababu-rahul-gandhi-congress-alliance-201

ఇప్పుడిదంతా ఎందుకంటే, అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య‌నేత‌ల‌తో చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యారు.  అందులో ధ‌ర్మ‌పోరాట  దీక్ష‌లు, రెండు రాష్ట్రాల్లో పార్టీ ప‌రిస్ధితి, తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంతో పాటు   జాతీయ‌, అంత‌ర్జాతీయ అంశాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. వీట‌న్నింటిక‌న్నా ప్ర‌ధాన‌మైన అంశం ఏమిటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి పొత్తులు పెట్టుకునే అవ‌కాశాల‌పై చ‌ర్చించ‌టం.  అస‌లు చంద్ర‌బాబు చ‌ర్చించాల‌నుకున్న‌ ఇంపార్టెంట్ అంశ‌మైతే ఇదే. కాక‌పోతే నేరుగా ఇదే అంశాన్ని చ‌ర్చిస్తే బాగోద‌ని దీనికి మ‌రికొన్ని అంశాల‌ను అజెండాలో క‌లిపారంతే.


కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ

tdp-chandrababu-rahul-gandhi-congress-alliance-201

ఇక‌, ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటే బాగుంటుంద‌ని కొంద‌రు మంత్రులు చెప్పారు. గ‌తంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పై ఇపుడు జ‌నాల్లో వ్య‌తిరేక‌త త‌గ్గుతోంద‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని జ‌నాల‌ను మోసం చేసిన బిజెపిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ట‌. విచిత్రంగా లేదు మంత్రుల అభిప్రాయం ?  ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని బిజెపి, టిడిపి రెండూ క‌లిసే హామీ ఇచ్చాయి. చివ‌ర‌కు  రెండు పార్టీలు క‌లిసే జ‌నాల‌ను మోసం చేశాయి. కేంద్రం ప్ర‌త్యేక‌హోదాను ఇవ్వ‌లేద‌న‌టం  ఎంత నిజ‌మో. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు హోదాను కేంద్రానికి తాక‌ట్టుపెట్టార‌న‌ట‌మూ  అంతే నిజం.  అపుడు బిజెపి మీదున్న వ్య‌తిరేక‌త టిడిపిపై ఉండ‌దా ?


బిజెపి ఇమేజ్ మ‌స‌క‌బారింద‌ట 

tdp-chandrababu-rahul-gandhi-congress-alliance-201

బిజెపి హోదా ఇవ్వ‌న‌ని చెబుతున్న స‌మ‌యంలోనే కాంగ్రెస్ హోదా ఇస్తామ‌ని చెప్ప‌టంతో జ‌నాలు క‌న్వీన్స్ అవుతున్నార‌ట‌. అదే స‌మ‌యంలో మొన్న కాంగ్రెస్ ను మోసం చేసిన టిఆర్ఎస్ ను బిజెపి కూడా న‌మ్మ‌ద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. బిజెపి ఇమేజి ఏపిలో మ‌స‌క‌బారుతోంద‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ఏపిలో బిజెపికి అస‌లు ఇమేజీ ఉంద‌ని అనుకున్న మంత్రులెవ‌రో మ‌హానుభావులు.  ఏదో గాలివాటుకు నాలుగు సీట్లు వ‌స్తే వ‌చ్చిన‌ట్లు లేక‌పోతే లేదు.  ' పెట్టుకున్న‌దే గోచి...ఉంటే ఎంత ఊడితే ఎంత ' ?  అన్న‌ట్లుంది తెలుగు రాష్ట్రాల్లో  బిజెపి ప‌రిస్దితి. 


బ‌హిరంగ ప్ర‌క‌ట‌న ఎప్పుడో ?


స‌మావేశం జ‌రిగిన తీరు చూస్తుంటే పార్టీ నేత‌లంద‌రినీ కాంగ్రెస్ తో పొత్తుకు చంద్ర‌బాబు సిద్ధం చేసిన‌ట్లే ఉన్నారు. ఎలాగూ టిడిపిలో చంద్ర‌బాబు నిర్ణ‌యానికి తిరుగన్న‌దే లేదు.  కాక‌పోతే ప్ర‌తీ విష‌యాన్ని పార్టీలో ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పేందుకు చంద్ర‌బాబు ఇంత సీన్ క్రియేట్ చేస్తుంటారు. తాజా స‌మావేశంలో జ‌రిగింది కూడా అంతే. చూడ‌బోతే కాంగ్రెస్ తో పొత్తుకు చంద్ర‌బాబు రెడీ అయిపోయారు. బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌ట‌మే  మిగిలింది. 


tdp-chandrababu-rahul-gandhi-congress-alliance-201
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 కెటియార్ జోస్యం..నిజమవుతుందా ?
భీమిలీలో పోటీకి గంటా భయపడుతున్నారా ?
ఎడిటోరియల్ : టెన్షన్లో సిట్టింగ్ ఎంఎల్ఏలు
ఎడిటోరియల్ : పోటీ నుండి ఫిరాయింపు ఎంపి అవుట్..అత్యాశ ఫలితం
ఎడిటోరియల్ : చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న అసమ్మతి..స్వీప్ చేసేదెవరు ?
ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కలిస్తేనే మంచిదా ?
వైసిపిలో ’గౌరు’ సంచలనం తప్పదా ? వైసిపికి దెబ్బేనా ?
గుడివాడలో టిడిపికి గట్టి అభ్యర్ధే దొరకటం లేదా ?
జగన్ లండన్ వెళ్ళింది డబ్బుల కోసమేనా ?
ఎడిటోరియల్ : చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రయోగం ? తిరుపతి నుండేనా ?
టిడిపిలో ఎస్సీలకు ధైర్యం లేదా ?
ఎడిటోరియల్: చంద్రబాబుకు లక్ష్మీస్ ఎన్టీయార్ టెన్షన్
10 మంది అభ్యర్ధులు ఫైనల్..గుడివాడలో అభ్యర్ధే దొరకటం లేదట
ఎడిటోరియల్ : టిడిపిలో రివర్స్ సర్వేలు..అందుకే  పార్టీని వీడుతున్నారా ?
ఎడిటోరియల్ : టికెట్..టికెట్! చంద్రబాబు మీడియా పాట్లు
ఎడిటోరియల్ : జగన్ –నాగార్జున భేటీ : చంద్రబాబుకు అంత కడుపుమంటా ?
ఎడిటోరియల్ : ఇద్దరి నేతల మధ్య ఇరుక్కుపోయిన చంద్రబాబు
వైసిపిలో చేరిన టిడిపి ఎంఎల్ఏ మోదుగుల
ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది చంద్రబాబుకా ? జగన్ కా ?
ఎడిటోరియల్ : పంచాయితీలు చేసేంత సీనుందా ?
బిగ్ బ్రేకింగ్ : జగన్ తో అక్కినేని భేటీ..గుంటూరు నుండేనా ?
పోటీ నుండి తప్పుకున్న తోట..పార్టీలో అనుమానాలు
ఎడిటోరియల్ : ఆ ఐదు జిల్లాలే టిడిపి కొంప ముంచుతాయా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.