టీడీపీ కి ఇప్పుడు మిత్రులు కరువైనారు 2014 లో టీడిపి వెంట ఉన్న జనసేన మరియు బీజేపీ ఇప్పడూ దూరం అయ్యింది ఎప్పుడు ఏ తోడు లేకుండా ఎన్నికల్లో వెళ్లే ధైర్యం బాబుకు లేదు కాబట్టి ఇప్పుడు కూడా మిత్రుల వేట కొనసాగిస్తున్నాడు. అయితే.. తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయి... పతనమైపోయి ఉన్న తెలంగాణలో ఆయన ఎవరితో జట్టుకట్టబోతున్నారనే విషయాన్ని తెలుగుదేశానికే చెందిన ఎంపీ మురళీమోహన్ సోమవారం నాడు లీక్ చేశారు.

Image result for chandra babu

తెలంగాణలో ప్రస్తుతం తెరాస పార్టీ బలంగా ఉన్నదనే విషయంలో ఎవ్వరికీ సందేహంలేదు. అలాగే.. తెలుగుదేశం పార్టీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేనంతగా దెబ్బతినిపోయి ఉన్నదనే సంగతి అందరికంటె బాగా చంద్రబాబునాయుడుకే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో... తెరాసతోనే జట్టుకట్టి.. అంతోఇంతో పార్టీ ఉనికి కాపాడుకోవడానికి చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Image result for chandra babu

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం బీభత్సంగా జరుగుతోంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నాయకులు పలు వేదికల మీద ఈ అంశాన్ని ప్రకటిస్తున్నారు కూడా. పైగా తెలుగుదేశం శ్రేణులు ఏమాత్రం ఖండించడం లేదు. ఇలాంటి అనైతిక పొత్తుల ఆలోచనలను ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు కూడా. అందుకేనేమో.. తెరాసతో అయితే పొత్తు గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడానికి తాజాగా చంద్రబాబు తన సొంత ఎంపీ ద్వారా ఇలాంటి లీక్ ఇచ్చినట్లుగా ప్రజలు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: