అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా చంద్ర‌బాబునాయుడు ఎలాగైనా మాట్లాడ‌గ‌ల‌రు. అధికారం అందుకోవ‌ట‌మే ఏకైక ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న‌పుడు మిగితా విష‌యాల‌ను చంద్ర‌బాబు ఏమాత్రం ప‌ట్టించుకోరు. ఎందుకంటే, చంద్ర‌బాబు త‌ర‌పున జ‌నాల‌ను మ‌భ్య‌పెట్ట‌టానికి టిడిపికి స‌దా  మ‌ద్ద‌తుగా నిల‌బ‌డే మీడియా అడుగుల‌కు మ‌డుగులొత్త‌టానికి సిద్ధంగా ఉంటుంది. కాబ‌ట్టే ఇప్ప‌టి వ‌ర‌కూ  చంద్ర‌బాబు ఏమి మాట్లాడినా చెల్లుబాట‌వుతోంది.


కాంగ్రెస్ ను  త‌రిమికొట్ట‌మ‌న్నారు

Image result for chandrababu and rahul gandhi

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ను ఏపి ద్రోహిగా వ‌ర్ణించారు.  కాంగ్రెస్ పార్టీని శాస్వ‌తంగా రాష్ట్రం నుండి బ‌హిష్క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపిచ్చారు.  జ‌నాలందూ ఛీ కొట్టాలంటూ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.   ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు విరుద్దంగా రాష్ట్ర విభ‌జ‌న చేసిన కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని త‌గుదున‌మ్మా అంటూ మ‌ళ్ళీ ఎన్నిక‌ల్లో ఆద‌రించ‌మ‌ని జ‌నాల‌ను కోరుతోందంటూ మండిప‌డ్డారు. 


ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా ?

Image result for voters in ap

ఇన్ని మాట‌లు మాట్లాడిన చంద్ర‌బాబు ఇపుడు అదే కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్ట‌టానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. పార్ల‌మెంటు లోప‌లా,  వెలుప‌లా ఇప్ప‌టికే కాంగ్రెస్-టిడిపిలు స‌హ‌కారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్న విష‌యం అందరూ చూస్తున్న‌దే. తాజాగా మంత్రులు, ముఖ్య నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో కాంగ్రెస్ తో పొత్తుల‌పై దాదాపు సూచ‌న చేసిన‌ట్లే. ఈ మ‌ధ్య హైద‌రాబాద్ లో పారిశ్రామిక‌వేత్త‌ల‌తో జ‌రిగిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహూల్ గాంధి స‌మావేశంలో చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి పాల్గొన‌టం కూడా భ‌విష్య‌త్ పొత్తుల‌కు సంకేతాల‌నే చెప్పాలి.  ఒక‌పుడు ద్రోహుల‌ని వ‌ర్ణించిన కాంగ్రెస్ తోనే చంద్ర‌బాబు క‌ల‌వాల‌ని అనుకుంటే జ‌నాలు ఆద‌రిస్తారా  ?



మరింత సమాచారం తెలుసుకోండి: